ఏపి లో వడగాల్పులు..అల్లాడిపోతున్న జనం  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో సూర్యుడి ప్రతాపం అంతాఇంతా కాదు. సూర్యుడి ప్రతాపం, వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 6 గంట నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ప్రజలు రోడ్డుమీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప జనం రోడ్డుమీదకు రాని పరిస్థితి. ఉదయమే భానుడి భగభగలతో వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు ఏపీలో ఈరోజు 20 మండలాల్లో వడగాల్పు ప్రభావం ఉందని ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని, మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండనున్నట్లు పేర్కొంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు విపత్తుల సంస్థ నుంచి హెచ్చరిక సందేశాలు వెలువడుతున్నాయి. మెసేజ్ అందినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ సూచనలు చేసింది.

Leave A Reply

Your email address will not be published.