విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గిందా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామనిస్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని ఫగ్గన్‌ సింగ్ వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామనియాజమాన్యంకార్మిక సంఘాలతో చర్చిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. బిడ్‌లో తెలంగాణ సర్కార్ పాల్గొనడం ఓ ఎత్తుగడ మాత్రమేనని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తే అభిప్రాయపడ్డారు.విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వహణకు మూలధన సేకరణలో భాగంగా ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్-ఈవోఐ)ను ఆహ్వానించిన నేపథ్యంలో.. దాని బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిశ్చయించుకుందని వార్తలొచ్చాయి. బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా.. అటు రాజకీయంగా కేంద్రంలోని బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టినట్లవుతుందని.. ప్రైవేటీకరణను అడ్డుకున్నామని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా మైలేజీ వస్తుందని బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ భావిస్తున్నారని ఇటు మీడియాలోఅటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గత నెల 27న ఈవోఐ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఆసక్తిగల కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఈవోఐ బిడ్లలో ప్రభుత్వాలు నేరుగా పాల్గొనేందుకు వీల్లేదు. కంపెనీలు మాత్రమే పాల్గొనాలి. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కారుకు సింహభాగం వాటా ఉన్న సింగరేణి సంస్థను రంగంలోకి దించాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయడానికి యత్నిస్తుంటే.. దానిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడుతెలంగాణా సీఎం కేసీఆర్‌ సింగరేణి కాలరీస్‌తో బిడ్‌ వేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే… అసలు వాస్తవం వేరు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియకుప్రైవేటీకరణకు సంబంధం లేదు. ముడిపదార్థాల సరఫరా లేదా వర్కింగ్‌ క్యాపిటల్‌ను సమకూర్చితే… దానికి సమానమైన విలువగల స్టీల్‌ ఇస్తాం! ఆసక్తి ఉన్న వాళ్లు ముందుకు రండి’ అని విశాఖ స్టీల్స్‌ ఆసక్తి వ్యక్తీకరణ’ (ఈవోఐ) ప్రకటన జారీ చేసింది. అంతే తప్ప.. ఇది స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి కానే కాదు.

ఈవోఐలో ఏముందంటే..

‘‘వర్కింగ్‌ క్యాపిటల్‌ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా స్టీల్‌ ఇస్తాం’’ అంటూ గతనెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవోఐ వెలువరించింది. ఇందులో… ‘‘ఉక్కుఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని తెలిపింది. స్టీల్‌ తయారీ సంస్థలతో అనుబంధంఅనుభవం ఉన్నవారెవరైనా బిడ్‌ వేయవచ్చునని స్పష్టం చేసింది. ‘‘స్టీలు తయారీకి సంబంధించిన ముడిపదార్థాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ (ఉదాహరణకు కోకింగ్‌ కోల్‌/బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కోల్‌ఇనుప ఖనిజం) సరఫరా చేసి… దానికి బదులుగా స్టీల్‌ ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదా… వర్కింగ్‌ క్యాపిటల్‌ (నగదు) సమకూర్చితే దానికి బదులుగా స్టీల్‌ ఉత్పత్తులను సరఫరా చేస్తాం’’ అని ఈవోఐలో పేర్కొన్నారు. స్టీల్‌ను ఏ ధరకు ఇస్తారనే విషయాన్ని ఇందులో వెల్లడించలేదు. అయితే… మార్కెట్‌ రేటుకంటే తక్కువకే స్టీలు ఇస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉక్కు తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల రంగంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈవోఐకి ముందుకురావాలని ఇందులో స్పష్టంగా చెప్పారు. ఏప్రిల్‌ 15వ తేదీలోపు స్పందించాలని కోరారు.

సింగరేణి వల్ల విశాఖ ఉక్కుకు ఒరిగేదేమిటని జోరుగా చర్చ..

విశాఖ ఉక్కులో అడుగుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడమే కేసీఆర్‌ వ్యూహమనే విమర్శలు వినిపిస్తుండగా.. అసలుసింగరేణి వల్ల విశాఖ ఉక్కుకు ఒరిగేదేమిటనే చర్చ కూడా జరుగుతోంది. సింగరేణి వద్ద బొగ్గు మాత్రమే ఉంది. అది విద్యుదుత్పత్తికి మాత్రమే ఉపయోగపడుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం తనకు అవసరమైన థర్మల్‌ కోల్‌ను మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి తెప్పించుకుంటోంది. బొగ్గు సరఫరాపై మహానదితో ఒప్పందం ఉండటంతో టన్ను రూ.3000 నుంచి రూ.3500 పడుతోంది. గత ఏడాది మేజూన్‌ నెలల్లో బొగ్గు సమస్య వచ్చినప్పుడు సింగరేణి నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. సింగరేణి బొగ్గును ఏకంగా టన్ను రూ.6 వేలు పెట్టి కొన్నారు.ఒక దశలో టన్ను రూ.12 వేలు కూడా పలికింది. పైగా సింగరేణి నుంచి విశాఖకు బొగ్గు తెచ్చుకోవడం దూరాభారం అవుతుందనిరవాణా వ్యయం పెరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు… అసలు ఈ బిడ్‌లో పాల్గొనే అర్హత సింగరేణికి లేదని వైసీపీ వర్గీయులుజగన్‌ మీడియా ప్రచారం చేస్తుండటం విశేషం. విశాఖ ఉక్కు పిలిచిన బిడ్‌ ప్రైవేటీకరణకోఅమ్మకానికి సంబంధించినదో కాదు. కేవలం ముడి పదార్థాల సరఫరా కోసమే ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మొత్తం ప్రక్రియలో ఏపీ సర్కారు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. కేంద్రమే విశాఖ ఉక్కును నడపలేమని చేతులు ఎత్తేసినపుడు ఇక ఏ రాష్ట్రమైనా ఏమి చేయగలదంటూ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వేదాంతం చెబుతున్నారు

Leave A Reply

Your email address will not be published.