భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో

- హాజరైన పొన్నం ప్రభాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు హాజరు కావడం జరిగింది.

అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపడుతున్న భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని ఏఐసిసి మరియు పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పద్మనగర్ లో ఇంటింటికి తిరుగుతూ హాథ్ సే హాథ్ జోడో ప్రాముఖ్యతను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ, డోర్ స్టిక్కర్లను అంటించారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు చేపడుతున్న 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని ప్రతి పౌరుడికి రాహుల్ గాంధీ గారి సందేశం చేరవేయాలనే ఉద్దేశంతో చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నేడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది, ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని, ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశ్యంతో, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాని పరిస్థితుల్లో జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుందని, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా అనవసరమైన విషయాలను చర్చకు తీసుకువచ్చి సమస్యలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతరం దేశ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని గాని, దేశ నిర్మాణంలో చేసిన త్యాగాలను చరిత్రను మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ప్రజలను కోరుతూ, ఈ హాథ్ సే హాథ్ జోడో నేటి నుండి 60 రోజులపాటు ప్రతి ఇంటింటికి చేరు విధంగా కొనసాగుతుందని, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.