దేవుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశాడుక.. కానీ కోరి ఫ‌లించ‌లేదు

- పెళ్లి కుమార్తె దొర‌క‌డం లేద‌నే కోపంతో ఏకంగా శివ‌లింగాన్నే అప‌హ‌రించాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఓ యువ‌కుడు త‌న‌కు పెళ్లి కావాల‌ని ఎన్నో పూజ‌లు చేశాడు. దేవుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశాడు. కానీ ఆ కోరిక ఫ‌లించ‌లేదు. దీంతో త‌న‌కు పెళ్లి కుమార్తె దొర‌క‌డం లేద‌నే కోపంతో ఏకంగా శివ‌లింగాన్నే అప‌హ‌రించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కౌశంభి జిల్లాలో వెలుగు చూసింది.కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువ‌కుడు ప్ర‌తి రోజు స్థానికంగా ఉన్న భైర‌వ బాబా టెంపుల్‌కు వెళ్లేవాడు. త‌న‌కు త్వ‌ర‌గా పెళ్లి కావాల‌నిమంచి అమ్మాయి దొర‌కాల‌ని దేవుడిని చోటూ ప్రార్థించేవాడు. అలా క‌నీసం నెల రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు చోటూ. చివ‌ర‌కు అమ్మాయి దొర‌క్క‌పోవ‌డంతో.. అస‌హ‌నానికి గురైన చోటూ ఆగ‌స్టు 31న శివ‌లింగాన్ని అప‌హ‌రించాడు.అయితే శివ‌లింగం క‌నిపించ‌క‌పోవ‌డంతో మిగ‌తా భ‌క్తులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. భ‌క్తుల‌ను విచారించారు. చోటూ అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో.. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించ‌గాచేసిన నేరాన్ని అంగీక‌రించాడు. తాను ఎన్నో పూజ‌లు చేసిన‌ప్ప‌టికీఅమ్మాయి దొర‌క్క‌పోవ‌డంతోనే విసుగు చెంది శివ‌లింగాన్ని అప‌హ‌రించిన‌ట్లు తెలిపాడు చోటూ. ఆల‌యానికి స‌మీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివ‌లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.