తెలంగాణ వస్తే పోడు భూములకు పట్టాలు వస్తాయని కలలుగన్నారు

.. రాములు నాయక్ ,మాజీ ఎమ్మెల్సీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ వస్తే పోడు భూములకు పట్టాలు వస్తాయని కలలుగన్న తెలంగాణ ప్రజల ఆశలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు చల్లారని  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. పోడు భూముల సమస్య ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య చిచ్చుపెట్టింది ముఖ్యమంత్రి, 8 సంవత్సరాలు ఒకరికి కూడా పట్టా ఇచ్చింది లేదన్నారు. పోడు భూములు ఉన్న దగ్గర హరితహారం మొక్కలు నాటాలని ఫారెస్ట్ అధికారులకు మొక్కలు సీఎం సూచిస్తున్నారు. నిన్న ఫారెస్ట్ అధికారి చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. అక్కడ హరితహారం మొక్కలు నాటిన ప్లేస్ లో పశువులు మేపుతున్నారని దాడి చేయబోయారన్నారు. ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సీఎస్ కి మొన్ననే మెమరాండం ఇచ్చాము. మంత్రులు, ఎమ్మెల్యేల లతో కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారన్నారు. తక్షణమే గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల పై దాడులు ఆపాలి. లేదంటే ముఖ్యమంత్రి ఏ1 గా అధికారులు మార్చాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.