కేంద్రం ఇచ్చిన నిధులపై తాను చర్చకు సిద్దం

- మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: కేంద్రంతో ఫైట్ చేయడానికి మొన్నటి వరకు కేసీఆర్ బరిలో ఉండగా.. ఇప్పుడు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రం తెలంగాణ నుంచి తీసుకెళ్లిన నిధులు అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులపై తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ విషయంలో తనది తప్పయితే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కేటీఆర్ చెబుతున్న ప్రకారం ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో లక్షల 68 కోట్ల రూపాయలను తెలంగాణ కేంద్రానికి చెల్లించందని అందులో లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం తిరిగి తెలంగాణకు చెల్లించిందన్నారు. కేంద్రం ఇక్కడి నిధులతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చేసుకుంటుందని ఆరోపించారు.  దీనిపై చర్చకు సిద్దమా..అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ఇప్పటికే స్పీడు పెంచింది. అటు బీజేపీ సైతం వివిధ మార్గాల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు పోయే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ అవకాశం వచ్చినా కేంద్రంపై ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ గతేడాది నుంచే యుద్ధం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ విస్తరించే పనిలో బిజీ అయ్యారు. ఈ తరుణంలో కేంద్రంపై ఫైట్ చేసే బాధ్యతలను ఇప్పుడు కేటీఆర్ తీసుకున్నారు.తాజాగా కేంద్రంపై కేటీఆర్ లెక్కలతో సహా ఆరోపణలు చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ నుంచే కేంద్రానికి అత్యధికంగా నిధులు వెళ్తున్నాయని అన్నారు. కానీ తెలంగాణలో అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ఇవ్వాల్సిన నిధుల్లో ఇప్పటి వరకు కేవలం ఒక లక్షా 68 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా సొమ్మునంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు. ఒక దేశ ప్రధాని అన్ని రాష్ట్రాల అభివృద్ధి చూసుకోవాలని కానీ తెలంగాణను పట్టించుకోకుండా ఇక్కడ రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కేంద్రం నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కేటీఆర్ ఆరోపణలపై విమర్శలు చేస్తున్నారు. సామాన్యులకు ఈ లెక్కలు అర్థం కావనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేశంలోని తెలంగాణ నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా నిధులు వెళ్తున్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధులతోనే దేశం ఖర్చుపెట్టడం లేదన్నారు. కరోనా కాలం నుంచి కేంద్రం పేదలకు ఉచిత బియ్యాన్ని అందిస్తుందన్నారు. అంగన్ వాడీ సెంటర్లకు పౌష్టికాహారం ఇస్తుందని తెలిపారు. ఈ నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక మధ్యాహ్న భోజనం ఉపాధి హామీ పథకం వంటి వాటికి కేంద్రం అధికంగానే నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. అయితే ఆ లెక్కలు చెప్పకుండా కేవలం లక్షా 68 వేలు ఇచ్చారనడం విడ్డూరమని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.