దానికి ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడుదానికి ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చెన్నై సొగసరి రెజీనా కసాండ్రాకు తెలుగులోనూ మంచి పాపులారిటే ఉంది. కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది. అయితే ఈ అమ్మడి క్రేజ్ టైర్2 హీరోల వరకే పరిమితమైంది. దగ్గరదగ్గరిగా రెండు దశాబ్దాల పాటుగా ఇండస్ట్రీలో ఉంటున్న ఒక్క స్టార్ హీరోతో కూడా ఈ బ్యూటీ జత కట్టలేకపోయింది. అయితే మిడ్ రేంజ్ హీరోలకు మాత్రం మంచి ఆప్షన్లా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగులో అడప దడపాగా సినిమాలు చేస్తుంది కానీ.. తమిళంలో మాత్రం వరుస ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడుపుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సైతం క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని పేర్కొంది.ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి కాల్ చేసి అడ్జెస్ట్‌మెంట్‌కు ఓకే అంటే ఛాన్స్ ఇస్తా. ఆ వెంటనే షూటింగ్ కూడా మొదలుపెడదాం అని అన్నట్లు రెజీనా చెప్పింది. అయితే అప్పుడు తనకు అడ్జెస్ట్మెంట్ అంటే ఎంటో తెలీదని, తన మేనేజర్‌ను అడిగితే అసలు విషయం చెప్పాడని వెల్లడించింది. ఇది జరిగి పది సంవత్సరాలైందని, మళ్లీ అలాంటి అనుభవం ఎప్పుడూ తనకు ఎదురు కాలేదని రెజీనా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రెజీనా ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన శాకినీ డాకినీ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో మ్యాగీ అంటూ ఈ అమ్మడు చేసిన కామెంట్స్ టాలీవుడ్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది.