ఎస్పీలు మునుగోడులో ప్రచారం చేస్తారని.. తన లాంటి ‘హోంగార్డులు కాదు

.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోమటిరెడ్డి బ్రదర్స్.. వీళ్లద్దరూ కాంగ్రెస్ లోనే ఎదిగారు.. కాంగ్రెస్ లోనే అసమ్మతి రాజేశారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగా.. అన్న వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీలోనే అసమ్మతి రాజేస్తున్నాడు. ఆ మధ్య ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన తమ్ముడిని గెలిపించాలని వెంకటరెడ్డి చేసిన ఫోన్ కాల్స్ దుమారం రేపాయి. ఆ గొడవ సద్దుమణిగిన తర్వాత ఇక వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినర్ హోదాలో మునుగోడు ప్రచారం చేస్తాడని.. తమ్ముడిని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి తన చిత్తశుద్ధిని చాటుకుంటాడని అంతా అనుకున్నారు.కానీ కట్ చేస్తే తాజాగా షాకిచ్చాడు. ఎస్పీలు మునుగోడులో ప్రచారం చేస్తారని.. తన లాంటి హోంగార్డులు‘ చేయరంటూ మునుగోడు ప్రచారానికి పోను అంటూ మీడియా ముందు ఈరోజు బాంబు పేల్చారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని ఓ పెద్ద మనిషి (రేవంత్ రెడ్డి) అన్నారని ఆయన తెస్తే చూద్దాం అంటూ సెటైర్ వేశారు.తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారం చేయడని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రేవంత్ రెడ్డి మాటలను బూచీగా చూపి వెంకటరెడ్డి తప్పించుకున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.‘100 కేసులు పెట్టినా సరే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నాయకుడు చెప్పాడు. ఆయనే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాడు. మాతో పనిలేదు. కడియం శ్రీహరికి నన్ను విమర్శించే స్తాయి లేదు. రాజయ్యను అడిగితే కడియం చరిత్ర చెబుతాడు. ఇక నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది కేటీఆర్ నే అడగండి‘ అంటూ వెంకటరెడ్డి తాజాగా మీడియాతో వ్యాఖ్యానించారు.మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు చావోరేవో అన్నట్టుగా పోరాడుతున్నాయి. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పోటీచేస్తే కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తానని అన్న వెంకట్ రెడ్డి ప్రకటించినా ఎవరూ నమ్మలేదు.దీనిపై రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.వెంకటరెడ్డి ఎటువైపు ఉంటారని అందరూ ఆరాతీశారు. కానీ ఇప్పుడు ట్విస్ట్ వచ్చిపడింది. అన్నాదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉన్నా వారి అనుబంధం మాత్రం ఎక్కడికి పోలేదని అర్థమైంది. పార్టీలు సిద్ధాంతాల కంటే ఆ అన్నకు తమ్ముడిపైనే ప్రేమ కలిగింది. అందుకే బీజేపీలో ఉన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారానికి పోకూడదని వెంకటరెడ్డి నిర్ణయించుకున్నారు. దీనికి రేవంత్ రెడ్డి మాటలనే బూచీగా చూపి వైదొలగడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.