కోవిడ్‌19 ప‌రిస్థితుల‌పై ఉన్న‌త అధికారుల‌తో ఆరోగ్య‌శాఖ‌ మంత్రి స‌మావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి:  కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఇవాళ ఆరోగ్య‌శాఖ‌కు చెందిన ఉన్న‌త అధికారుల‌తో స‌మావేశం అయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్‌19 ప‌రిస్థితుల‌పై ఆయ‌న స‌మీక్షించారు. ఢిల్లీలో ఆయ‌న అధికారుల‌తో మాట్లాడారు. ప్ర‌స్తుతం చైనాలో మ‌ళ్లీ కోవిడ్ వేవ్ వస్తున్న‌ట్లు వార్త‌లు వెలుబ‌డుతున్నాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో మ‌ళ్లీ జ‌నం ప్రాణాలు కోల్పోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా వార్నింగ్‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో దేశంలో ఉన్న కోవిడ్ ప‌రిస్థితుల‌పై కేంద్ర మంత్రి మాండ‌వీయ స‌మీక్షించారు.ప్ర‌పంచవ్యాప్తంగా కోవిడ్ ప‌రిస్థితి సీరియ‌స్‌గా ఉంద‌ని, చైనాలో ఏం జ‌రుగుతుందో చూస్తున్నామ‌ని, ఆ దేశంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ స్తంభించిపోయిన‌ట్లు కాంగ్రెస్ నేమ మ‌నీష్ తివారి ఆరోపించారు. చైనా నుంచి వ‌చ్చే, వెళ్లే విమానాల‌ను నిలిపివేయాల‌ని ఆయ‌న కోరారు. ఇత‌ర దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు కాంగ్రెస్ నేత తెలిపారు.కోవిడ్ వేరియంట్ల‌ను ట్రాక్ చేసేందుకు పాజిటివ్ పేషెంట్ల‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.