చిరుదాన్యాలు (మిల్లెట్స్) తో ఆరోగ్య పరిరక్షణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండియన్ మినిట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ పోస్టర్ ను రాష్ట్ర గవర్నర్ తమిళ సై ఆవిష్కరించారు.ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ చిరుదాన్యాలు (మిల్లెట్స్) మన ఆరోగ్య పరిరక్షణను ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మన పూర్వికులు చిరుదాన్యాలు వాడి ఏలాంటి రోగాల బారిన పడకుండా వంద సంవత్సరాలు జీవించగలిగిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసారు.అనంతరం అసోసియేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ పురం వెంకటేశం గుప్త మాట్లాడుతూ ఇండియన్ మిల్లెట్స్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉద్దేశం మిల్లెట్స్ ను వాడి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ బవిషత్ ఆక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. కుకింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడం, వంటావార్పు కార్యక్రమాన్ని పుస్తక రూపంలో రూపొందించి ప్రజలకు అందజేయడం, అవేర్నెస్ క్యాంపులను నిర్వహించడం, పారిశ్రామిక వాడలను సందర్శించి మిల్లెట్స్ వాడకం గురించి వివరించడం, రైతులకు విత్తనాలు అందించి పంటలు వేయించి కొనుగోలు చేయడం, పాత పంటలను గుర్తు చేయడం ప్రపంచంలో యువత మొట్టమొదటిసారిగా తెలిపారు.అలాగే  రైతులు వ్యాపారస్తు అనుసంధానం చేయడం ,సంవత్సరం పాటు వెల్ఫేర్ గ్రూప్, రైతు సంఘాలు,రైతు ఫెడరేషన్లతో మీటింగ్ ఏర్పాటు చేసి అవఘాన  కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బేకరీ సీడ్స్ లడ్డు లాంటి తినుబండారాలను కూడా రూపొందించుకోవడానికి క్యాంపులను నిర్వహించబోతున్నామన్నామని తెలిపారు.ఇందుకు గాను  మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా రాష్ట్ర మండల స్థాయిలో ఎగ్జిబిషన్ కూడా పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తినే వస్తువులు తయారీ మిషన్ కూడా ప్రజలకు అందజేయడం వాటిపట్ల అవఘాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.ఇందుకు  ప్రభుత్వం వ్యాపారస్తులు ఎందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రై ల్యాండ్ పంటల డెవలప్మెంట్ కూడా వాడుకోవాలని అందుకనుగునంగా అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు గాను  ప్రభుత్వం సహాయ సహకారాలు కూడా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో పురం బాల కృష్ణ, మాణిక్యం గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.