భారీగా తగ్గిన చికెన్ ధరలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఎంతో కష్టపడి, లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ల పెంపకం చేస్తుంటే.. ధరలు పడిపోవడంతో దాన ఖర్చులు కూడా గిట్టుబాటు అవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు కోళ్ల పెంపకందారులు. చికెన్ రేట్లు పడిపోవడానికి ఈనెల కార్తీక మాసం కావడంతో కోళ్ల రేట్లు పడిపోయాయని మరో పది పదిహేను రోజుల్లో కోళ్ల రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇప్పటికే… పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులు పడుతుంది.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా చికెన్ కొనడానికి ఆసక్తి చూపుతున్నారు మాంసం ప్రియులు. గత నాలుగునెలల క్రితం కిలో 3 వందల రూపాయలు దాటిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలోకు ఏకంగా 120 నుంచి 140 లకు పడిపోయింది. దీంతో మాంసం ప్రియులు ఎగబడుతున్నారు. కిలో తీసుకునే బదులు రెండు మూడు కిలోలు తీసుకుంటున్నారు. చికెన్ వంటకాలలో వివిధ రకాల చికెన్ వెరైటీస్ వండుకొని తినడానికి ఇష్టపడుతున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.