హిమాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారీ వర్షాల నేపథ్యంలో … హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల కారణంగా 200 మంది పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌ మండి జిల్లాలోని బాగిపుల్‌ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించాయని, పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని పోలీసులు ఆదివారం తెలిపారు.                                                            మండి-కులు జాతీయ రహదారి దిగ్బంధం…
మండిలోని బాఘీ వంతెన చుట్టూ మేఘాలు వ్యాపించి ఉన్నాయని, వరద కారణంగా కమాండ్‌కు ముందు పరాశర్‌కు వెళ్లే రహదారి మూసివేయబడిందని మండి పోలీసులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయి. అస్సాంలో ఇప్పటికీ 2.72 లక్షల మంది వరదల్లోనే ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్‌లోని కాంగ్రా సిటీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా.. తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని, అవుట్‌ సమీపంలోని ఖోటి నాలాలో మండి-కులు జాతీయ రహదారిని దిగ్బంధించినట్లు మండి పోలీసులు నోటీసు జారీ చేశారు.                                                      మరో 5 రోజులు ప్రతికూల వాతావరణ పరిస్థితులు…
కుల్లు- మండీ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అక్కడి రాకపోకలు నిలిచిపోయాయి. కామాండ్‌ ప్రాంతంలో 25- 30 వాహనాలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మరో 5 రోజులపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.                                                          వరదలో చిక్కుకున్నవారికి సౌకర్యాల ఏర్పాటు…
సంజీవ్‌ సూద్‌, మండి జిల్లా పోలీసులు, డిఎస్‌పి పదర్‌ మీడియాతో మాట్లాడుతూ …. మండి జిల్లాలోని బాగిపుల్‌ ప్రాంతంలోని ప్రశార్‌ సరస్సు సమీపంలో వరదలు సంభవించాయని, పర్యాటకులు, స్థానికులతో సహా 200 మందికి పైగా ప్రజలు మండి ప్రషార్‌ రోడ్‌లోని బగ్గీ వంతెన సమీపంలో చిక్కుకుపోయారని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు డీఎస్పీ సూద్‌ చెప్పారు. చంబా నుండి వచ్చిన విద్యార్థుల బస్సు, పరాశర్‌ నుండి తిరిగి వస్తున్న అనేక వాహనాలు వరదలో చిక్కుకున్నాయని అన్నారు. ఈరోజు రాత్రికి రోడ్డు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో వరదలో చిక్కుకున్నవారందరికీ రాత్రిపూట బస చేసేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.                                                                                 దారి మళ్లింపు…
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పండో-మండి జాతీయ రహదారిలో ఛార్మిలే నుండి సత్మిలే మధ్య చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారిని మూసివేశామని, తెరవడానికి సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. కులు నుండి చిన్న వాహనాలు పండోV్‌ా నుండి చైల్‌ చౌక్‌ మీదుగా సుందర్‌ నగర్‌ చండీగఢ్‌ నుండి నెర్‌ చౌక్‌కు వెళతాయని అధికారులు తెలియజేశారు. కమాండ్‌ సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో కటోలా మీదుగా మండి-కులు రహదారి మూసివేయబడిందని, శిథిలాలను తొలగించి రేపు రహదారి తెరిచే చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.                                                             ఉత్తరాఖండ్‌లో పలు జిల్లాలకు ఆరెంజ్‌ ఎలర్ట్‌..
ముంబయి సహా మహారాష్ట్ర తీర ప్రాంతంలో రాగల 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఒడిశా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో వర్షాల సంబంధిత ఘటనల్లో నలుగురు మఅతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రుద్రప్రయాగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో శిథిలాల కింద చిక్కుకొని ఒకరు మఅతి చెందారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు ‘ఆరెంజ్‌ అలెర్ట్‌’ జారీ అయ్యింది. వాతావరణ సమాచారం తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని ‘చార్‌ధామ్‌’ యాత్రికులకు సిఎం పుష్కర్‌సింగ్‌ ధామీ సూచనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.