జోరుగా అక్రమ ఇసుక రవాణా

- నసురుల్లాబాద్ మండల కేంద్రం గా అక్రమ ఇసుక వ్యాపారం - పట్టించుకోని రెవెన్యూ శాఖ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ నెట్వర్క్ ఇంచార్జ్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని నసురుల్లాబాద్ మండల కేంద్రం నుండి అక్రమ ఇసుక జోరుగా సాగుతుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బీర్కూరు మండల పరిధిలోని మంజీరా పరివాహక ప్రాంతం నుండి ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం రెవెన్యూ శాఖ అధికారులు వారంలో రెండుసార్లు ఇసుక రవాణాకు ట్రాక్టర్ల సహాయంతో అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని నసురుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మండల కేంద్రంలో గల ఓ కంకర క్వారీ సమీపంలో ఇసుకడంపును ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ఇసుక టిప్పర్ల తరులుతున్న సమయంలో వెనకాల ఓ తెల్ల రంగు కారులో దాని వెనకాలే ఫాలో చేస్తూ ఎవరైనా అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారికి పెద్ద నాయకుల పేర్లు చెప్పి బెదిరింపులకు సైతం గురి చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్న సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం .ఏది ఏమైనప్పటికీ నసుల్లాబాద్ మండల కేంద్రం నుండి అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణ పై అధికారులు చర్యలు చేప్పటల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

  • విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాము.

  • నసురాబాద్ మండల కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా విషయమై తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిధి నసురుల్లాబాద్ తసిల్దార్ బావయ్య ను వివరణ కోరగా ఇసుక రవాణాపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఆయన సమాధానం ఇచ్చారు.
Leave A Reply

Your email address will not be published.