ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంటి కంగ్టి మండలంలో అత్యధికంగా 13 సెంటీ మీటర్లు వర్షం పడింది. సిద్దిపేట జిల్లా నారాయణరావు పెట్ మండలంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మెదక్ జిల్లా కౌడి పల్లిలో 8.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉదయం 3 నుంచి అన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షం కురుస్తుంది. ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి పోయాయి. సింగూరు ప్రాజెక్టు నిండు కుందలా మారింది.

Leave A Reply

Your email address will not be published.