అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను ముంచేత్తిన భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అగ్రరాజ్యం అమెరికా లోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షం కారణంగా పోటెత్తిన వరదతో సబ్‌వేలు అపార్ట్‌మెంట్లు పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా ఈ వరదలతో ఆ దేశ ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరం అతలాకుతలమైంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు, వీధులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోని భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మరోవైపు ఈ వరద విమానాశ్రయాల్లోకి పోటెత్తడంతో వాటిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పలు రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో న్యూయార్క్‌ గవర్నర్‌ ఖాతీ హోచల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర మేయర్‌ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.