టీఎస్పీఎస్సీ పై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: టీఎస్పీఎస్సీ( రూల్స్ పాటించకపోవడంతో గ్రూప్1 మళ్లీ రద్దు అయింది. జూన్ 11వ తేదీన నిర్వహించిన గ్రూప్1 రద్దు చేస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. గ్రూప్1ను మళ్లీ నిర్వహించాలి. టీఎస్పీఎస్సీ రూల్స్‌ను పాటించలేదని.. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విధంగా అభ్యర్థుల నుంచి బయో మెట్రిక్ ఎందుకు తీసుకోలేదు టీఎస్పీఎస్సీ రూల్స్‌ పాటించకపోవడంతో 2,33,506 మంది అభ్యర్థులు నష్టపోయారు. టీఎస్పీఎస్సీ పరీక్షను సరిగా నిర్వహించకపోవడంతో ఆరుగాలం కష్టపడిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు’’ అని టీఎస్పీఎస్సీ పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో గ్రూప్1 రాసి తీవ్రంగా నష్టపోతున్నామని ముగ్గురు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో బుధవారం నాడు ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు టీఎస్పీఎస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

Leave A Reply

Your email address will not be published.