అక్రమ రిజిస్ట్రేషన్ లపై ఉన్నతాధికారుల మౌనమేల…?

.. బాన్సువాడ సబ్ రిజిస్టర్ పై చర్యలు చేపట్టేనా? .. నిబంధనలు గాలికి .. జోరుగా కొనసాగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లు .. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని బీర్కూరు మండలం దామరంచ గ్రామ పరిధిలో గల 7వేల గజాల స్థలb విస్తీర్ణాన్ని ప్లాట్లుగా చేసి డిటిసిపి అప్రూవల్ లేకుండానే కేవలం పంచాయతీ కార్యదర్శి జారీ చేసినటువంటి ధ్రువీకరణ పత్రం లింక్ డాక్యుమెంట్ల సహకారంతో 13 డాక్యుమెంట్లను సబ్ రిజిస్టర్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. పంచాయతీ పరిధిలో 300 గజాల స్థలం విస్తీర్ణంకు మించి ఉంటే కచ్చితంగా జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కి దరఖాస్తు చేయాల్సిందే అలాంటిది ఇక్కడ మాత్రం కేవలం లింక్ డాక్యుమెంట్స్ పంచాయతీ ధృవీకరణ పత్రం ఆధారంగా చూపుతూ డాక్యుమెంట్లు చేయడం గమనార్హం ..పంచాయతీ డిమాండ్ రిజిస్టర్ ప్రకారం సైతం గతంలో ఆ ఏడు వేల గజాల స్థలం విస్తీర్ణంలో కేవలం 533 గజాల విస్తీర్ణంలో రైస్ మిల్ ఉండేది ప్రస్తుతం ఆ రైస్ మిల్ స్థలం డిస్మాండిల్ ఓపెన్ ల్యాండ్ గా పంచాయతీ అధికారులు చూపించారు. సదరు రైస్మిల్ స్థలానికి ఇంటి నెంబర్ ఉండడంతో అసెస్మెంట్ నెంబర్ సైతం జారీ చేశారు. వీటిని ఆధారంగా చూపుతూ 7వేల గజాల స్థలానికి సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం నిబంధనలు తుంగలో తొక్కడమే అవుతుందని పలువురు మేధావులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులు వార్తలు పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ ఎలాంటి చర్యలు పూనుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా గతంలో బాన్సువాడ సబ్ రిజిస్టర్ గా విధులు నిర్వహించిన ఇద్దరు సభ్యులు ఒకరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు అదేవిధంగా మరొక సబ్ రిజిస్టర్ బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ బాధ్యులు చేస్తూ వారిపై సైతం వేటువేసి సస్పెండ్ చేశారు ప్రస్తుతం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ బాన్సువాడ సబ్ రిజిస్టర్ పై చర్యలు చేపట్టేన అని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి నూతన సంస్కరణలను ఎన్ని తీసుకువచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో సంస్కరణలు అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటికే టీఎస్పీ పాస్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయిలో మాత్రం టీఎస్ బి పాస్ అమలుకు నోచుకోవడం లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతుండడం ఇందుకు నిదర్శనం….లింక్ డాక్యుమెంట్ ,పంచాయితీ ధృవీకరణ పత్రం తో రిజిస్టర్ చేసాము…బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ స్వామి దాస్… బీర్కుర్ మండలం లోని దామరంచ గ్రామ శివారులో జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ ల పై బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ ను తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా లింక్ డాక్యుమెంట్,పంచాయితీ ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశామని ఏదైనా తప్పు గా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఉన్నత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఆయన సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.