అధిక ఉష్ణోగ్రతలు హీట్ స్ట్రోక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అధిక ఉష్ణోగ్రతలు హీట్ స్ట్రోక్ డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ క్రాంప్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు.అధిక వేడి యొక్క దుష్ప్రభావాలను నివారించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను అనుసరించడం చాలా కీలకం.

వడదెబ్బ నివారించేందుకు చిట్కాలు

వడదెబ్బ అనేది అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల కలిగే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి. భారతదేశంలో చాలామంది వేసవి కాలంలో వడదెబ్బ గురై మరణిస్తారు. వడదెబ్బకు తక్షణ చికిత్స అవసరం, లేకుంటే మూత్రపిండాలు, కండరాలు, మెదడు, గుండె త్వరగా దెబ్బతింటుంది.

వడదెబ్బ లక్షణాలు:

  • శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది
  • గందరగోళం, అస్పష్టమైన మాటలు, చిరాకు
  • చెమట లేకుండా ఎరుపెక్కి, పొడిబారిన చర్మం
  • వేగవంతమైన శ్వాస, వాంతులు, వికారం
  • గుండె వేగంగా, ఎక్కువసార్లు కొట్టుకోవడం
  • తలనొప్పి,శరీర తిమ్మిరి

వడదెబ్బను ఎలా నివారించాలి:

వడదెబ్బకు గురైన సమయంలో ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, తాజా ఉండే రసాలు తీసుకోవాలి.

  • అధిక ఉష్ణోగ్రతలలో వ్యాయామం చేయడం మానుకోండి
  • చల్లటి నీటితో స్నానం చేయండి
  • లేత రంగు, వదులుగా, సౌకర్యవంతమైన బట్టలు ధరించండి
  • ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు బయటకి వెళ్లకుండా ఉండాలి
  • ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తుంది.
  • వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇతర చిట్కాలు:
  • బాగా హైడ్రేటెడ్‌గా ఉండండి
  • వేసవి కాలంలో దొరికే నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవాలి.
  • సన్‌స్క్రీన్ ధరించండి, తేలికైన, పల్చటి దుస్తులను ధరించండి
  • మీ శరీర ఉష్ణోగ్రతను పెంచే చర్యలను నివారించండి
  • మీ ఆహారంలో శరీర శీతలకరణిగా పనిచేసే ఆహారాలను జోడించండి
Leave A Reply

Your email address will not be published.