వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రానున్న ఐదు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నదంటూ పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములుమెరుపులుఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని పేర్కొన్నది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక లో జాప్యం ఏర్పడింది. సాధారణంగా ప్రతి సీజన్‌లో జూన్‌ ఒకటి నాటికి క్రమం తప్పకుం డా నైరుతి రుతుపవనాలు కేరళ వద్ద తీరాన్ని తాకి నాలుగైదు రోజుల్లోనే విస్తరిస్తుంటాయి. ఈసారి కేరళ తీరం వైపుగా రుతుపవనాల కదలికలు స్తంభించిపోవడానికి అరేబియా సము ద్రం ఆగ్నేయ ప్రాంత గగనతలంపై 5.8 కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తన ద్రోణి కారణం. మరో 24 గంటల వ్యవధిలో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నది. క్రమంగా ఈ నెల 8 నాటికి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం రుతుపవనాల కదలికలపై ఉం టుంది. ఈ పరిస్థితులు కేరళ తీరం వైపునకు నైరుతి రుతుపవనాల పురోగతిని తీవ్రంగా ప్ర భావితం చేసే అవకాశం ఉన్నదని అంచనా వే సింది. ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐ ఎండీ పేర్కొన్నది. రుతుపవనాల రాకలో జా ప్యం వల్ల ఎండ తీవ్రత కొనసాగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.