సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారం

- : హైకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సలహాదారుల వ్యవహారంపై హైకోర్టు లో విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై విచారణ జరిగింది. ఏవైనా రాజకీయాలుంటే బయటే చేసుకోవాలని, రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దని ధర్మాసనం స్పష్ట చేసింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని కోర్టు వ్యాఖ్యానించింది. నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని హైకోర్టుకు ఏజీ తెలిపారు. మెరిట్స్‌ పై వాదనలు వినిపిస్తామని ఏజీ తెలిపారు. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని కోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని హైకోర్టు వ్యాఖ్యానించింది.రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన సలహాదారులను నియమించడంపై హైకోర్టు మండిపడిన విషయం తెలిసిందే. వివిధ శాఖలకు సలహాదారుల నియామకంలోని రాజ్యాంగబద్ధతను తేలుస్తామని ప్రకటించింది. రాజ్యాంగంలో సలహాదారుల నియామకానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయో లేదో తేలుస్తామని తెలిపింది. ముఖ్యమంత్రులకు, మంత్రులకు సలహాదారులను నియమించడాన్ని.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకే విధంగా చూడలేమని వ్యాఖ్యానించింది. వివిధ శాఖలకు నేతృత్వం వహించే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కన్నా.. బయటి నుంచి వచ్చినవారు మెరుగైన సలహాలు ఇస్తారా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

Leave A Reply

Your email address will not be published.