ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు.

ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది అన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ ల్ లాంటి ప్రజా నాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది అన్నారు. ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం అవుతుంది. ప్రజలు, రైతులు ఇథనాల్ ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. ప్రజల పోరాటానికి జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమారులు సంఘీభావం ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా.. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ మండలి నాయకుణ్ణి నిర్బంధిస్తారా. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ లను వెంటనే విడుదల చేసి పోరాటంలో భాగస్వాములను చేయాలి అన్నారు. రైతులు, ప్రజలు కోరుకున్న విదంగా విధానాలను అమలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని  రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.