అత్తింటి వేధింపులకు గృహిణి ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  విశాఖ ఆర్కే బీచ్ లో శవమై లభ్యమైన యువతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట్లో ఇక్కడ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు యువతి ఆత్మహత్యగా భావించారు.  వివరాలు రాబట్టిన తరువాత ఆమె పేరు శ్వేతగా.. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భిణీ గా తేలడంతో మరింత లోతుగా లోతుగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు శ్వేత రాసిన ఓ లెటర్ ను బయటపెట్టారు. ఇందులో శ్వేత రాసిన కొన్ని వ్యాఖ్యలను పరిశీలిస్తే కుటుంబ సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ‘నిన్ను నువ్వు ప్రశ్నించుకో..’ అని భర్తను ఉద్దేశించి రాయడంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారు.శ్వేత కుటుంబ సమస్యలతో తీవ్రంగా మనోవేదన చెందినట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ఒకరోజు ముందు ఓ లెటర్ ను రాసి ఇంట్లో పెట్టి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమె బయటకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆమె బ్లూ గౌన్ వేసుకున్నారని అంటున్నారు.అయితే అంతకుముందే అత్తమామలు ఆసుపత్రి పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో శ్వేత కనిపించకపోవడంతో రాత్రి 12 గంటల వరకు వేచి చూశారు. ఆ తరువాత న్యూ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అదృశ్యం కేసుగా నమోదు చేశారు.విశాఖ రైల్వే ఆసుపత్రిలో శ్వేత నర్సుగా పనిచేస్తున్నారు. గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితుల కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గురువిల్లి మణికంటతో ఏడాది కిందట వివాహం అయింది. అయితే 15 రోజలు కిందట మణికంఠ కార్యాలయం పనిమీద హైదరాబాద్ కు వెళ్లారు. దీంతో శ్వేత అత్తమామలతోకలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె చనిపోయే ముందు రోజు తన భర్త మణికంఠతో చాలా సేపు ఫోన్లో మాట్లాడినట్లు వివరాలు సేకరించారు. ఈ సమయంలో వీరి మధ్య మాటా మాటా పెరిగిందని తెలుస్తోంది.ఈ క్రమంలో ఆమె ఓ లెటర్ రాసి బయటకు వెళ్లింది. ఈ లెటర్ లో ‘నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండగలవని నేను అనుకుంటున్నా.. ఏదేమైనా  నీ ఫ్యూచర్ న్యూ లైఫ్ కు ఆల్ ది బెస్ట్.. నీతో చాలా మాట్లాడాలని ఉంది. కానీ నేనేమీ మాట్లాడలేకపోతున్నా.. అయితే ఒకసారి ‘నిన్ను నువ్వు ప్రశ్నించుకో..’ అని లెటర్ లో రాసి ఉంది.ఈ లెటర్ ను చూసి శ్వేత తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కూతురు అత్తింటి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.