అయినవోలు జాతర ఏర్పాట్లలో ఏ చిన్న లోపం ఉండకూడదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్:  ఐనవోలు జాతరకు గొప్ప చరిత్ర ఉంది ఈ చరిత్రను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని, కరోనా పెరుగుతుంది.. కాబట్టి జాతరనాటికి తగిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ అన్నారు. బుదవారం జాతర ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడ స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని ఏ పని చేసినా శుభమే జరుగుతుందని, గత 40 ఏళ్లుగా తాను అలాగే చేస్తున్నానని, ఈ చరిత్రను, పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

2023 జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లు, భక్తుల వసతుల కల్పనపై నేడు ఐనవోలు దేవస్థానంలో మంత్రి దయాకర్ రావు గారు సంబంధిత అన్ని శాఖలతో సమీక్ష చేశారు.

సమీక్ష అనంతరం మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి, దర్శనం కల్పించి, వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.

టెంపుల్ కు గొప్ప చరిత్ర ఉంది. దానిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. 40 ఏళ్లుగా వస్తున్నా.. ఇక్కడ ఆశీర్వాదం తీసుకుని ఏ పని చేసినా మంచి జరుగుతుంది. ఏ చిన్న లోపం లేకుండా జాతర ఏర్పాట్లు, దేవాలయ అభివృద్ది జరగాలి ఈ జాతర విజయవంతం చేయడంలో పోలీస్ కమిషనర్ గారికి పెద్ద బాధ్యత ఉంది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని పని చేయాలి. వెంటనే జాతర పనులు చేయండి…ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తాను. కలెక్టర్ గారు కూడా వెంటనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పాం ఈ జాతర మనకు చాలా ముఖ్యం. కరోనా ఇంకా తీవ్రం కాలేదు. జాతర నాటికి తీవ్రం అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. క్యాంప్స్ పెడుదాం. పాసులు, పార్కింగ్, మంచి నీటి వసతి, పరిశుభ్రత, పటిష్టంగా ఉండాలి. శాశ్వత పనుల కోసం సమగ్రంగా ప్రతిపాదనలు తయారు చేస్తే సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే మంజూరు చేస్తారు. హరిత హోటల్ కూడా ఇక్కడ చాలా ముఖ్యం. కాబట్టి నేను చొరవ తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. ఆర్టీసి వాళ్ళు గత అనుభవాల ఆధారంగా మరింత బాగా వసతులు కల్పించాలి. జాతరకు వచ్చే చుట్టు పక్కల గ్రామాల్లో, దారుల్లో కూడా పరిసరాలు పరిశుభ్రంగా చేయాలి. టాయిలెట్స్ చాలా నీట్ గా ఉండాలి. ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. జాతర సమయంలో ఏమి చెయ్యాలి…శాశ్వత ప్రాతిపదికన తరవాత ఏమి చెయ్యాలో కూడా నిర్ణయించాలి. దాదాపు 10 కోట్ల రూపాయల పనులు కానున్నాయి. ఇవన్నీ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఢిల్లీ నుంచి 5 కోట్ల రూపాయల పనికి క్లియరెన్స్ ఇవ్వడం లేదు .వెంటపడి చేసుకుందాం నా వల్ల అయ్యేది నేను చేస్తాను. ఈ టెంపుల్ నాది. వెనుకటి కాకతీయ రాజులు చేశారు. దానిని కాపాడాలి. ఈ ఏడాది మేడారం జాతర లేదు. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే పెద్ద జాతర మరోసారి కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీక్ష పెట్టీ, పనులు వేగంగా చేయాలన్నారు.  ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి ప్రావీణ్య, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి సునీత, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పోలీస్, రవాణా, మున్సిపల్, దేవాదాయ శాఖ, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య శాఖ, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, సమాచార మరియు ప్రసార శాఖ, మరియు సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.