ఇండోనేషియాలో భారీ భూకంపం.. 46 మంది మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  ఇండోనేషియాలో జక్తారాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలగా.. పెద్ద ఎత్తున పగుళ్లు బారాయి. ప్రకంపనలతో 46 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. ఒకే ఆసుపత్రిలో 46 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్నది. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జకార్తాలో భూకంపం సంభవించిందని జియోఫిజిక్స్‌ ఏజెన్సీ పేర్కొంది.పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. భారీ ప్రకంపలతో కార్యాలయాల్లో నుంచి ఉద్యోగులుఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ ఇండోనేషియాలో గత శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించగా.. భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితేతీవ్రంగానే ప్రకంపనలు వచ్చినా ఎలాంటి నష్టం జరుగకపోవడం విశేషం కానీ. ఇవాళ 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి భారీగా ఆస్తిప్రాణనష్టం సంభవించింది.

Leave A Reply

Your email address will not be published.