మానవత్వమే యోగా తత్వం 

-  శ్రీమతి లిల్లీ మేరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మానవత్వమే యోగా తత్వం అని మనందరికీ తెలిసినంతవరకు యోగ అంటే వివిధ ఆసనాల ద్వారా శారీరిక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే  ఓ విధానం అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు.    సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ యోగానికి, మానవత్వాన్ని కూడా జోడించి మరింత మందికి చేరువ చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్ష ఆహ్వానించదగినదని,   వసుదైవ కుటుంబం అనే ఇది వృత్తంతో  ఏడాది నిర్వహించనున్న యోగా దినోత్సవం అని,   యోగ తత్వము మానవ తత్వము అనే సద్భావన ప్రతి ఒక్కరిలో కలుగజేస్తుందని, మానవ తత్వము యొక్క ప్రధాన అంతరార్థం కూడా సేవా మార్గమే రండి…,  లేవండి …, మేల్కోండి…!  గమ్యం చేరే వరకు విశ్రమించకండి  అని వివేకానందుని పిలుపు ఎందరినో ఉత్తేజపరిచిందని మన భారతీయ ఆరోగ్య ఆనంద జీవన కళ యోగాను అంతర్జాతీయంగా ఆచరించేందుకు కృషిచేసిందని దాని కారణంగా ఐక్యరాజ్యసమితి  జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేలా 2014 డిసెంబర్ 11 తీర్మానం చేసింది సర్వ ప్రతినిధి సభ ప్రకటించిన  తీర్మానాన్ని 193 సభ్య దేశాలు అంగీకరించగా అందులో 177 దేశాలు సహ  ప్రయోజకులుగా వ్యవహరించడానికి ముందుకు రావడం శుభపరిణామం అని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ పతాంజలి మహర్షి రచించిన యోగ సూత్రాలకు ఆలంబనగా నిలిచాయి.  ఆయన రచించిన 195 యోగా సూత్రాలు ఎన్ని తరాలు మారినా నిత్య నూతనంగా ఆచరించబడుతున్నాయి.  ఆయన వివరించిన అష్టాంగ యోగాలలో యమము,  నియమము,  ఆసనము,  ప్రాణాయామము,  ప్రత్యాహారము,  ధారణ,  ధ్యానముసమాధి.  అయితే వీటిలో ఆసనాలు,  ప్రాణాయామము,  ధ్యాన క్రియలు యోగా సాధనలో ప్రధానమైనవిగా పేర్కొంటారు.  ఈ క్రియలను సాధన చేస్తే గొప్ప ప్రయోజనం కలుగుతుందని లిల్లీ మేరి అన్నారు.

యోగా తో ప్రయోజనాలు

ప్రపంచంలో వచ్చిన సాంకేతిక విప్లవము మనిషి జీవనశైలిని ప్రభావితం చేస్తున్నది.  మనిషి కాలముతో పరిగెడుతున్నాడు.  ఈ క్రమంలో శారీరక శ్రమ కంటే మేధోశ్రమకు ప్రాధాన్యత పెరిగింది.  ఇది మానసిక ఒత్తుడలకు,  శారీరక రుగ్మతలకు కారణమవుతున్నాయి.  ఈ స్థితి నుంచి బయటపడటానికి యోగాను తమ జీవన విధానంలో భాగముగా మార్చుకోవాలి.  యోగా అభ్యాసము వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెలుగు చూస్తున్న నిజాలుకండర బలాన్ని పెంచుకోవడంతో పాటు,  శరీరాన్ని మనకు అనువైనదిగా మార్చుకోవటం,  శ్వాసకోస వ్యవస్థను మెరుగుపరుచుకోవటం,  మానసిక ఒత్తిడి,  ఆందోళనలు దరిచేరకుండా ఉండటం,  దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడంతోపాటు,  సంపూర్ణ ఆరోగ్యానికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించాలి.  అంతేకాదు శారీరక మానసిక వికాసాలతో పాటువిద్యారంగముక్రీడలుకళారంగాలలో గొప్ప ఫలితాలు సాధించడంలో యోగా గొప్ప శక్తిగా నిలుస్తున్నది.  తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.