కిడ్నీ మార్పిడిశస్త్ర చికిత్సలలో జాతీయ రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ నిమ్స్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడిశస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా జాతీయ రికార్డు సాధించింది నిమ్స్. ఈ సందర్భంగా ఆర్థికవైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావునిమ్స్‌ యూరాలజీవిభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్‌ఆదేశాల మేర‌కు అవయవ మార్పిడి సర్జరీలను ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.నిమ్స్‌ యూరాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నేతృత్వంలో డాక్టర్‌ సీహెచ్‌ రామ్‌ రెడ్డిడాక్టర్‌ ఎస్‌ విద్యాసాగర్‌డాక్టర్‌ జీ రామచంద్రయ్యడాక్టర్‌ జీవీ చరణ్‌ కుమార్‌డాక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ ధీరజ్‌తో కూడిన బృందం ఈ సర్జరీలను విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్‌ పద్మజడాక్టర్ జే నిర్మల నేతృత్వంలోని అనస్థీషియా విభాగండాక్టర్‌ టీ గంగాధర్‌డాక్టర్ భూషణ్ రాజ్ నేతృత్వంలోని నెఫ్రాలజీ విభాగం వారికి స‌హ‌క‌రించారు.

Leave A Reply

Your email address will not be published.