ఇప్పటికీ నేను చదువుకుంటున్న

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని సందర్శించిన మంత్రి సీతక్క ఆమె.. ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థిని అభినందించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. పదో తరగతి పూర్తవగానే వ్యవస్థ మార్పు కోసం గన్ను పట్టానని చెప్పారు. తరువాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చాననని వెల్లడించారు. రాజకీయాల్లో కొనసాగుతూనే.. ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి చేశానని చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా పని కొనసాగుతున్నప్పటికీ.. ఎల్‌ఎల్‌ఎం సెకండ్ ఇయర్ చదువుతున్నానని చెప్పారు. తమ ప్రభుత్వ హయంలో సర్కారు బడిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు.కాగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆమెకు 2022లో పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసింది. రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. సీతక్క అసలు పేరు దనసరి అనసూయ. చిన్ననాటి నుంచి సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న సీతక్క.. నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలైంది. 1988లో పదో తరగతి చదువుతున్న సమయంలో సీతక్క మావోయిస్టు పార్టోలో చేరింది. పదేళ్లకు పైగా ఉద్యమంలో పని చేసింది. ఆ తర్వాత అప్పటి సీఎం ఎన్టీ రామారావు పిలుపుమేరకు జనజీవన స్రవంతిలో కలసిపోయారు.జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత 2001లో సీతక్క న్యాయవాద విద్యలో చేరింది. ప్రజల అవసరాలు తీరుస్తూ.. ప్రజా సేవకు అంకితమైన సీతక్కను చంద్రబాబు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అలా 2004 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆమె.. చదువును ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 2022లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

Leave A Reply

Your email address will not be published.