నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్న

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఫోన్ స్విఛాఫ్ చేశాడంటూ ఉదయం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. నేను ఎక్కడికీ పోలేదన్నా.. ఇదిగో మా ఇంట్లోనే ఉన్నా చూడుర్రి అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ప్రశాంత్ పక్కనే కొంతమంది యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు, ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్లతో కూడా మాట్లాడించాడు ప్రశాంత్.తప్పుడు వార్తలు”జై జవాన్ జై కిసాన్.. అన్నా నేను ఏడికీ పోలే.. అవన్నీ తప్పుడు సమాచారాలు.. నేను ఇంటికాడనే ఉన్నా.. బరాబర్ ఇంటికాడనే ఉన్నా.. అన్నా వాళ్లు కూడా ఈడే ఉన్నారు.. కావాలంటే అయ్యప్ప స్వాములతో కూడా మాట్లాడిస్తా చూడండి.. స్వామీ మీరే చెప్పాలి నేను ఎటు ఎటో పోయినా అంటుర్రు.. మీరే చెప్పండి” అంటూ తన పక్కన ఉన్న స్వాములతో మాట్లాడంచాడు ప్రశాంత్.”పల్లవి ప్రశాంత్ ఏడికీ పోలేదు.. ఇంటికాడే ఉన్నాడు.. నిన్న పడి పూజ ఉండే.. ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని పిలిచినా.. ఎప్పుడూ వచ్చేటోడే.. అయితే అందరూ ఇంటికి వస్తుర్రు అన్నా.. నేను ఫొటోలు దిగకపోతే బావుండదు.. దూరం దూరం నుంచి వచ్చిర్రు.. నువ్వు ఎప్పుడూ కలిసోటేడివే.. జర ఏమనుకోకు తప్పు అయింది అన్నాడు.. సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రశాంత్.. నేనే నీ దగ్గరి వస్తానని నేనే వచ్చినా.. ఇందాక న్యూస్ ఛానల్స్‌లో ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.. అక్కడున్నాడు ఇక్కడున్నాడని వేస్తుర్రు.. అవన్నీ అబద్ధాలు ప్రశాంత్ ఈడనే ఉన్నాడు.. తప్పుడు వార్తలు పెట్టకండి.. ఎందుకంటే ఒక మనిషి జీవితమిది..” అంటూ ఆ స్వామి మాట్లాడారు.టెన్షన్ పడకుర్రి”ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి వచ్చిర్రు.. నేను ఏడికీ పోలే.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దయ చేసి నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలే.. ఎవరెవరో చేసినవి నా మీద వేస్తుర్రు.. కావాలని నెగెటివ్ చేయడానికే ఇవన్నీ చేస్తున్నారు.. నేను ఏడికీ పోను.. అయినా ఆ న్యూస్ చూసి నేనే పరేషాన్ అయినా.. నా ఫోన్ స్విఛాఫ్ వస్తుందంటే నేను వచ్చినప్పటి నుంచి ఫోనే పట్టుకోలే.. నేను ఇంకో పాత ఫోనులో వీడియోలు తీసుకున్నా తప్ప కొత్త ఫొన్ ముట్టుకోలే.. దయచేసి మీరే ఆలోచించండి.. నేను ఇంటికాడే ఉన్నా.. ఏడికి పోలే.. టెన్షన్ పడకుర్రి..” అంటూ తన పరారీ వార్తలపై రియాక్ట్ అయ్యాడు ప్రశాంత్.

Leave A Reply

Your email address will not be published.