నాటు నాటు పాట నాకు నచ్చలేదు

- అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడ ఉంది? - కీరవాణి తండ్రి శివశక్తి దత్తా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఈ పాటలోని లిరిక్స్‌ అర్థం కాకపోయినా విదేశీయులకు తెగ నచ్చేసింది. ఇందులోని మ్యూజిక్‌ వాళ్లకు పిచ్చెక్కించింది. అందుకే చిన్నా పెద్దా.. సామాన్యులు.. సెలబ్రెటీలు అనే తేడా లేకుండా చాలామంది ఈ సాంగ్‌కు కాళ్లు కదిపారు. నాటు నాటు సాంగ్‌కు వస్తున్న క్రేజ్‌ చూసి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు కూడా గేయ రచయిత చంద్రబోస్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణిని వరించింది. ఇంతలా అందర్నీ ఆకట్టుకున్న నాటు నాటు పాట మాత్రం కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు నచ్చలేదట. ఈ పాటలో అసలు సంగీతమెక్కడ ఉంది అంటూ తాజాగా సెన్సేషల్‌ కామెంట్స్‌ చేశాడు. శివశక్తి దత్తా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.కీరవాణికి ఆస్కార్‌ అవార్డు రావడం పట్ల అతని తండ్రి శివశక్తి దత్తా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా కీరవాణి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కీరవాణి తనకు పంచప్రాణాలు అని శివశక్తి దత్తా చెప్పుకొచ్చాడు. మూడో ఏట నుంచే కీరవాణికి సంగీతం నేర్పించానని చెప్పాడు. చిన్నప్పటి నుంచి కీరవాణి టాలెంట్‌ చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నానని తెలిపాడు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడ ఉంది? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ విధి విచిత్రమైనదని.. ఇన్నాళ్లు కీరవాణి పడ్డ కష్టానికి ఆస్కార్‌ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు.చంద్రబోస్‌ రాసిన 5వేల పాటల్లో ఒదొక పాటనా? కీరవాణి ఇచ్చిన సంగీతంతో పోలిస్తే ఇదొక మ్యూజికేనా? అని ప్రశ్నించాడు. నాటు నాటు పాటలో ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ మాత్రం చాలా అద్భుతంగా ఉందని శివశక్తి దత్తా ప్రశంసించాడు. ఈ పాటకు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ అద్భుతంగా డ్యాన్స్ చేశారని కొనియాడారు. రాజమౌళి కాన్సెప్ట్‌ అదుర్స్‌.. చంద్రబోస్‌, కీరవాణి కృషికి నాటు నాటు పాట రూపంలో ఫలితం దక్కిందని చెప్పుకొచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.