నేను అధ్యక్షుడినైతే.. ట్రంప్‌ను క్షమిస్తా

: వివేక్‌ రామస్వామి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయ‌న పోటీపడుతున్నారు. ఇందులో భాగంగా తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు,  చర్చా వేదికల్లో పాల్గొంటున్నారు. వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటూ అందరి దృష్టిని  ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏబీసీ న్యూస్‌ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న  వివేక్‌ రామస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున తానే  బరిలో దిగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిగా నామినేట్‌ అయితే ఆయనకు మద్దతిస్తానని స్పష్టం చేశారు.అదేవిధంగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రస్తుతం అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ట్రంప్‌ను  క్షమిస్తానని ప్రకటించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిగా నామినేట్‌ అయితే నేను అతనికి  మద్దతు ఇస్తాను. నేను అధ్యక్షుడిని అయితే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న ట్రంప్‌ను క్షమిస్తాను.  ఎందుకంటే అది దేశం మళ్లీ ఏకం కావడానికి సహాయపడుతుంది. తదుపరి దేశాధ్యక్షుడిగా నేను చేయబోయే  అతి ముఖ్యమైన విషయం ఇది కాకపోవచ్చు. కానీఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరం’ అని  రామస్వామి ఏబీసీ న్యూస్‌తో అన్నారు.

Leave A Reply

Your email address will not be published.