కాళేశ్వరం నీరొస్తే  రైతులు బోర్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది

- ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు విత్తనాలు కూడా వేయని పరిస్థితి -    టీపిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నెల రోజులు వర్షాలు పడనందుకే ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వెల్, సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో విత్తనాలు కూడా వేయని పరిస్థితి నెలకొందని కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న సీఎం ఇప్పుడు ఎం చెబుతారని టీపిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి ప్రశ్నించారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో బొజ్జ సంధ్యా రెడ్డి తో కలిసి మాట్లాడారు.కాళేశ్వరం అవినీతి కి కేంద్రం అని ఇప్పుడే తెలుస్తుందని,తెలంగాణ ఏర్పాటు అయ్యేనాటికి 19 లక్షల 3 వేల విద్యుత్ కనెక్షన్ లు ఉంటే.. ఇప్పుడు 27 లక్షల 49 వేల కనెక్షన్ లు ఉన్నాయన్నారు.కాళేశ్వరం ఉపయోగపడితే  రైతులు బోర్లు వేసుకోవాల్సిన అవసరం ఏముందని అయోధ్య రెడ్డి ప్రశ్నించారు.కాళేశ్వరం 18 లక్షల పాత ఆయకట్టు.. మరో  18 లక్షలు కొత్త ఆయకట్టు అని చెప్పారు 82 వేల కోట్లు నిధులు ఖర్చు చేశారు.2009 – 14 తెలంగాణ భవన్ కి టెలిపోన్ బిల్ కట్టకపోతే  కనెక్షన్ లు కట్ చేశారు..ఉద్యోగులకు జీతాలు ఇయ్యక నిరసనలు తెలిపారు.ఈరోజు మీకు 1200 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్నారు.కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయలేదు.. నిధులు ఎత్తిపోశారు..కాళేశ్వరం ద్వారా కెనాల్ నుండి ఏ ఒక్క ఎకరకైనా నీళ్లు ఇచ్చారా..కాళేశ్వరం కెసిఆర్ కుటుంబానికి ఏటీఎం అని చెబుతున్న బీజేపీ నాయకులు ఎం చర్యలు తీసుకున్నారని నిలదీశారు…మేము ఆధారాలతో సహా వారికీ ఇచ్చాం.. చర్యలు  చేపట్టలేదు ముఖ్యమంత్రి లాంటి నిరో చక్రవర్తి వల్లే ఇన్ని ఇబ్బందులు తలెత్తాయని అయోధ్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

Leave A Reply

Your email address will not be published.