కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి వెళ్తే, ష‌ర్ట్ విప్పి లోప‌లికి వెళ్లాల‌న్నారు  

- స‌నాత‌న ధ‌ర్మంపై సీఎం సిద్ధ‌రామ‌య్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఒక‌వైపు స‌నాత‌న ధ‌ర్మంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జరుగుతుంటే.. మ‌రో వైపు క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ఓ సారి కేర‌ళ‌లోని ఓ ఆల‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న గురించి ఆయ‌న కామెంట్ చేశారు. బెంగుళూరులో నారాయ‌ణ గురువుకు చెందిన 169వ వార్షికోత్స‌వంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఓసారి కేర‌ళ‌లో ఓ ఆల‌యానికి వెళ్తే, ష‌ర్ట్ విప్పి లోప‌లికి వెళ్లాల‌న్నార‌ని, అయితే ఆ ఆల‌యంలోకి వెళ్లేందుకు తాను నిరాక‌రించిన‌ట్లు గుర్తు చేశారు. గుడి బ‌య‌ట నుంచే దేవుడికి మొక్కుకున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ ష‌ర్ట్ తీసివేయాల‌ని కోర‌లేద‌ని, కొంద‌ర్ని మాత్రం అలా అడిగార‌ని సిద్ధ‌రామ‌య్య తెలిపారు. ఇలాంటి ప‌ద్ధ‌తి అమాన‌వీయంగా తోచిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. దేవుడి ముందు అంద‌రూ స‌మాన‌మే అని ఆయ‌న అన్నారు.

Leave A Reply

Your email address will not be published.