ఆ వార్తను పట్టించుకోవద్దు

- ఐటి శాఖ మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరోచీఫ్: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంట తీవ్ర విషాదం నెలకొందని కొన్ని వార్తలు ప్రచారమయ్యాయి. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథ రావు గుండెపోటుతో మృతి చెందారని ఈ ఉదయం ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన వయస్సు 72 సంవత్సరాలు కాగా.. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8.30 గంటలకు మృతి చెందినట్లు ఏఐజీ ఆసుపత్రి వైద్యులు డిక్లేర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ఓ క్లారిటీ నోట్ విడుదలైంది. కేటీఆర్ మామ గారి ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ అంటూ ఓ నోట్ విడుదల చేశారు. “మంత్రి కేటీఆర్ గారి మామయ్య ( కేటీఆర్ గారి భార్య శైలిమా తండ్రి) పాకాల హరినాథ్ రావు అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరి ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. ఆయన అనారోగ్యం విషయంలో వస్తున్న ఇతర వార్తలను పట్టించుకోవద్దని విజ్ఞప్తి.” అంటూ నోట్ విడుదల చేశారు. ఇక తన మామ హరినాథరావు అనారోగ్య గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన భార్య శైలిమా సహా ఇతర కుటుంబ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. పాకాల హరినాథరావు గతంలో డీహెచ్ఎఫ్ఓగా పని చేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.