అనాధ పిల్లల పేర్లు చెప్పుకొని అక్రమంగా ఆశ్రమాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: అనాధ పిల్లల పేర్లు చెప్పుకొని కొన్ని ఆశ్రమాలు అక్రమంగా నడుపుతున్నారు, అక్కడ పది పిల్లలు ఆశ్రమంలో ఉంటే 50.60 మంది పిల్లలు మా దగ్గర ఉన్నారని చెప్పి దాతల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, మోసం చేసే వాళ్ళకి ఇదొక దందాల మారిపోయిందని బిసి మహిళా నాయకురాలు మట్ట జయంతి గౌడ్ పేర్కొన్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్ద వయసు ఉన్న వాళ్ళని కూడా ఓల్డేజ్ హోం పేరుతో వాళ్ల పైన కూడా డబ్బులు దోచుకుంటున్నారు దొంగల్లాగా ఇలాంటి వారి ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాతిని గుర్తించి  లైసెన్స్ రద్దు చేయాలని జయంతి డిమాండ్ చేసారు. ప్రభుత్వమే ఇలాంటి వాళ్లకి ప్రత్యేకంగా కొత్త ఆశ్రమాలతో పాటు హాస్టల్స్ కూడా కట్టించాలన్నారు. పిల్లల పేర్లు పెద్ద వాళ్ల పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేసే వీళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఇలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదని, వాళ్లు బ్రతకడం కోసం వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని దీనికి సంబంధించినటువంటి అధికారులకి ఈ యొక్క ఆర్గనైజేషన్ల లైసెన్స్ రద్దు చేయాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ప్రభుత్వమే ఇలాంటి వాళ్ల గురించి ఆలోచించి కొత్త నిర్ణయం తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.