మరో మరి కొన్ని రోజుల్లోనే 800 కోట్లకు ప్రపంచ జనాభా.. వచ్చే ఏడాది చైనాను దాటేస్తోన్న భారత్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అంతేకాదు, 2023 నాటికి చైనాను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఈ ఏడాది జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ అంచనా వేసింది. అంచనా వేసిన గడువుకు కొద్ది రోజులే ఉండటంతో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఐరాస పేర్కొంది.2050 నాటికి అంచనా వేసిన జనాభాలో సగానికిపైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని నివేదిక తెలిపింది. అవి కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా. ప్రపంచ జనాభా 2030లో సుమారు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, ఆపై 2080లలో గరిష్టంగా 10.4 బిలియన్లకు చేరుకుని 2100 వరకు ఆ స్థాయిలోనే ఉంటుందని ఐరాస ఇటీవల అంచనా వేసింది.మెజారిటీ సబ్-సహారా ఆఫ్రికన్ దేశాలు, అలాగే ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇటీవలి సంతానోత్పత్తి క్షీణత ఫలితంగా జనాభా వైవిధ్యం ఉందని తెలిపింది. దీని కారణంగా పని చేసే వయస్సు జనాభా నిష్పత్తిలో పెరుగుదల ( 25 నుంచి 64 వయసు) తలసరి వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవకాశాన్ని అందిస్తుంది.‘‘మన వైవిధ్యాన్ని జరుపుకోవడానికి, మన ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడానికి, జీవితకాలాన్ని పొడిగింపు, మాతాశిశు మరణాల రేటును నాటకీయంగా తగ్గించిన ఆరోగ్యంలో పురోగతిని చూసి ఆశ్చర్యపోవడానికి ఇది ఒక సందర్భం’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సుస్థిరత, స్థిరమైన లక్ష్యాల బాధ్యతపై కూడా గుటెర్రస్ ప్రస్తావించారు. ‘‘ఇది మన గ్రహం పట్ల శ్రద్ధ వహించడానికి మన భాగస్వామ్య బాధ్యతను గుర్తు చేస్తుంది.. ఒకరికొకరు మన కట్టుబాట్లను మనం ఇంకా ఎక్కడ కోల్పోతున్నామో ప్రతిబింబించే క్షణం.’’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.