భాష విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాష విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్రాన్ని కూడా తలవంచేలా చేసి.. సుప్రీంకోర్టు తీర్పును కాదని జల్లికట్టును రాబట్టుకున్నారని తెలిపారు. ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ మనలో ఒకరు పైకి రావడం.. ఉన్నత స్థాయికి ఎదగడం.. తోటివారికి ఇష్టం ఉండదు. తెలుగు సంస్కృతికి బెజవాడ రాజధానిగా ఉండేది. కానీ రాను రాను ఆ ప్రభావం కోల్పోయింది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. 2007లో మొదలైన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2011, 2015, 2019లలో జరిగాయి. మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి, సాంకేతికత, సృజనాత్మక, సామాజిక రచనలకు సంబంధించిన విభిన్న అంశాలపై ప్రతి మహాసభలోనూ మేథో మథనం జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.