అయోధ్య ధామ్ రైల్వే స్టేష‌న్ ప్రారంభం..  

- అమృత్ భార‌త్ రైలుకు ప‌చ్చ‌జెండా ఊపిన మోదీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ప్ర‌ధాని మోదీ ఇవాళ అయోధ్య ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న ఆ న‌గ‌రంలో ఇవాళ రోడ్ షో నిర్వ‌హించారు. అనంత‌రం ఇటీవ‌ల రీడెవ‌ల‌ప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేష‌న్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ఉన్నారు. సుమారు 240 కోట్ల ఖ‌ర్చుతో అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను రీడెవ‌ల‌ప్ చేశారు. మూడు అంత‌స్థుల్లో నిర్మించిన ఈ స్టేష‌న్‌లో అన్ని ఆధునిక సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశారు. లిఫ్ట్‌లుఎస్క‌లేట‌ర్లుఫుడ్ ప్లాజాలుపూజా సామాగ్రి షాపులుక్లోక్ రూమ్‌లుచైల్డ్ కేర్ రూమ్‌లువెయిటింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొత్త‌గా నిర్మించిన అయోధ్య స్టేష‌న్‌కు ఐజీబీసీ గ్రీన్ స్టేష‌న్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది.రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ కొత్త గా వ‌స్తున్న అమృత్ భార‌త్ రైలు ఎక్కారు. ఆ రైలులో ఉన్న విద్యార్థుల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. అమృత్ భార‌త్‌వందేభార‌త్ రైళ్ల‌కు ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. రెండు అమృత్ భార‌త్‌ఆరు వందేభార‌త్ రైళ్ల‌ను ఇవాళ స్టార్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.