26న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారతదశ నూతన పార్లమెంటు భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తుదిమెరుగుల దశలో ఉన్న కొత్త పార్లమెంటు భవనాన్ని ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జాతికి అంకింత చేయనున్నారని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తొమ్మదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని భవన ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం 2014, మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

పార్లమెంటు భవన నిర్మాణ విశేషాలు..

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం ఘనతన దశదిశలా చాటేందుకు 2020 డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ చేపట్టింది. నిర్మాణంలో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్యపథ్‌ మధ్య ఉన్న 3 కిలోమీటర్ల స్థలంలో పార్లమెంట్‌ భవనం సహా కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మించారు. సెంట్రల్‌ సెక్రెటేరియట్‌, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లను ఏర్పాటు చేశారు. 64, 500 చదరపు మీటర్ల పరిధిలో పాత పార్లమెంటు అంత ఎత్తులో దీనిని నిర్మించారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు ఇందులో కూర్చునే వీలుంది. భారత రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిని కొత్త పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఉంచనున్నారు. దేశనేతలైన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ సహా పలువురు ప్రముఖులు, మాజీ ప్రధానుల చిత్రపటాలు పార్లమెంటు భవనంలో కొలువుతీరనున్నాయి. ఈ భవనానికి ఉన్న మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. పార్లమెంటులోకి వెళ్లేందుకు వీఐపీలకు, ఎంపీలు, సందర్శకులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జూలైలో ఈ కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలో జరపాలని అనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.