వంజరులను ఎస్ టి లలో చేర్చండి

ఎస్ టి రిజర్వేషన్ పెంపు పై అఖిల భారత వంజరి సేవ సంఘం హర్షం

గిరిజనులకు 10 శాతము రేజర్వేషన్లు ఇవ్వాలన్న సీఎం కెసిఆర్ నిర్ణయం పట్ల అఖిల భారత  వంజరి సేవ  సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీఎం కెసిఆర్ స్వాగతిస్తున్నామని,  గిరిజనులకు ఇది ఎంతో మేలు చేస్తుందని సీఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని అఖిల భారత వంజరి సేవ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ, వంజరి తెలంగాణ వంజరి సేవ సంఘము అధ్యక్షులు ఎదుగాని శంకర్ నారాయణ, ప్రధాన కార్యదర్శి   కాలేరు సురేష్ ధాత్రిక ధర్మరాజు  ఎదుగాని హరినాథ్ పోత్న్ కు అంజయ్య ఏమికే సూర్యనారాయణలు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనుల పట్ల ప్రేమతో  వారి సర్వతోముఖాభివృద్ధికి ఈ నిర్ణయం తీసుకోవడం  ఆహ్వానించదగ్గ పరిణామమమని అన్నారు. గతములో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచనలు చెయ్యలేదని కెసిఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని  వారు తెలిపారు.నిజమైన గిరిజనులైన వంజరులకు ,దేశవ్యాప్తంగా గిరిజనులుగా గుర్తింపబడ్డ  వంజరులను కూడా తెలంగాణ రాష్ట్రము లో  గిరిజనులుగా గుర్తించలని వారు విజ్ఞప్తి చేసారు.1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ST లు గా కొనసాగిన వంజరులను ఎటువంటి కారణాలు చూపకుండా  అన్యాయంగా బీసీ (డి ) జాబితాలోకి మార్చారని,చెల్లప్ప కమిషన్ కూడా ఈ అన్యాయాన్ని సవరించాలని సూచించిందని  వంజరులను ST జాబితా లోకి మార్చాలని వారు సీఎం కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు.గిరిజన ఆత్మ గౌరవ భవనంలో వంజరులకు ప్రాధాన్యత ఇవ్వాలని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదివాసీ గిరిజన భవన్ లో  వంజరి జాతికి కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసారు .ఈ భవనంలో  సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని వంజరి జాతికూడా మిగతా గిరిజన సోదరులతో కలిసి వారి ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు ..తమ న్యాయమైన కోరికకు మద్దతు తెలుపాలని వారు సోదర గిరిజన సంఘాలకు విజ్ఞప్తి  చేసారు

Leave A Reply

Your email address will not be published.