2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్            

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారతదేశాన్ని 2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో పదవ ”వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్” ను ప్రధాన మంత్రి బుధవారంనాడు ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

పదేళ్ల క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న ఇండియా ఈరోజు 5వ స్థానంలోకి వచ్చిందని ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగనుందని ప్రధాన ఎజెన్సీలన్నీ అంచనా వేస్తున్నాయని, యావత్ ప్రపంచం ఇదే అంచనాలతో ఉందని, అయితే ఇది జరిగితీరుతుందని తాను గ్యారెంటీ ఇవ్వదలచుకున్నానని మోదీ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిస్థితిలు అందరికీ తెలిసిన విషయమేనని, ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రతికూలతలను ఎదుర్కొని అభివృద్ధిలో పురోగమన బాట పట్టడం వెనుక గత పదేళ్లలో సంస్థాగత సంస్కరణలో మనం దృష్టి సారించడమే ప్రధాన కారణమని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ సత్తా, సామర్థ్యం, పోటీతత్వం పెరిగిందని అన్నారు.

యూఏఈకి చెందిన కంపెనీలు ఇండియాలోని ఫోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో బిలియన్ల డాలర్లు కొత్త పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకుందని మోదీ చెప్పారు. సుస్థిరతకు కీలక స్తంభంగా భారత్‌ వైపు ప్రపంచదేశాలు చూస్తున్నాయని అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయెద్ పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఇండియా, యూఏఈ మధ్య సంబంధాలు మరింత పరిపుష్టం కావడానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరుకావడం ఒక సంకేతమని అన్నారు.

రాబోయే 25 ఏళ్లు ఇండియా‌కు అమృత్ కాలం ..

భారతదేశం ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పూర్తి చేసుకుందని, ఇప్పుడు రాబోయే 25 ఏళ్లపై దృష్టి సారించిందని చెప్పారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సమాయానికి అభివృద్ధి చెందిన భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దడం మన ముందు ఉన్న లక్ష్యమని అన్నారు. ఆ కారణంగా రాబోయే 25 ఏళ్ల అమృత్ కాల్‌గా ముందుకు వెళ్తామని చెప్పారు. అమృత్‌ కాల్‌ దిశగా జరుగుతున్న తొలి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ఇది కావడం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములుగా 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని మోదీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.