అంతరిక్ష పరిశోధనలో భారత్ తనదైన ముద్ర

- ఇస్రో చైర్మ‌న్ ఎస్ సోమ్‌నాధ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భార‌త్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-3 బుధ‌వారం సాయంత్రం 6.04 గంట‌ల‌కు చంద్రుడి ద‌క్షిణ ధృవం స‌మీపంలో సుర‌క్షితంగా ల్యాండ్ అయింది. గంట‌ల త‌ర‌బ‌డి ఉత్కంఠ‌కు తెరదించుతూ మూన్ మిష‌న్ స‌క్సెస్ కావ‌డంతో యావ‌త్ దేశం సంబ‌రాల్లో మునిగితేలింది. చంద్ర‌యాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అనంత‌రం బెంగ‌ళూర్‌లోని మిష‌న్ కంట్రోల్ క్యాంప‌స్ వేదిక‌గా శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మ‌న్ ఎస్ సోమ్‌నాధ్ మాట్లాడారు.చంద్ర‌యాన్-3 విజ‌య‌వంతం కావ‌డంతో భార‌త్ ఇప్పుడు చంద్రుడిపై కాలుమోపింద‌ని ప్ర‌క‌టించారు. ఇక మూన్ మిష‌న్ విజ‌యవంతం కావ‌డంతో భారత్‌ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమైంది . బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది.దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్‌ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.

Leave A Reply

Your email address will not be published.