భారత్ జోడో యాత్రకు తరలిరావాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/గాంధారి: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని టీపీసీసీ ఐటీ సెల్ కన్వీనర్ మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం గాంధారి మండలంలో వివిధ గ్రామాలలో ఆయన పర్యటించారు. మేడిపల్లి, సర్వాపూర్, గౌరారం గ్రామాలలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 23 వ తేదిన తెలంగాణలో ప్రవేశించి కొనసాగుతుందని అన్నారు. సుమారు 13 రోజుల పాటు కొనసాగే పాదయాత్ర చివర్లో మనకు అతి సమీపంలోని జుక్కల్ నియోజకవర్గంలో జరుగుతుందని అన్నారు. ఆ పాదయాత్రకు రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తరలి రావాలని అన్నారు.

 

.. కాంగ్రెస్ లో పలువురు చేరిక

గాంధారి మండలంలోని మేడిపల్లి, సర్వాపూర్, గౌరారం గ్రామాలకు చెందిన తెరాస, ఇతర పార్టీల కార్యకర్తలు మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడిపల్లి గ్రామానికి చెందిన కిషన్, అక్బర్, సాయిలు, కాశీరాం రమేష్ తో పాటు మరికొంత మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. సర్వాపూర్ గ్రామానికి చెందిన యువకులు, మహిళా సంఘాల సభ్యులు రాహుల్ గాంధీ భారత్ జోడో యూత్రకు మద్దతిస్తూ కాంగ్రెస్ లో చేరారు. గౌరారం గ్రామానికి చెందిన పద్మశాలి సంఘ సభ్యులు మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.

 

.. పలువురుకి పరామర్శ

గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ కార్యాకర్తల కుటుంబాలను టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు సోమవారం పరామర్శించారు.దుర్గం తండా ఉప సర్పంచ్ సకారం నాయక్ కు ప్రమాదం జరిగిన విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన మదన్ మోహన్ రావు. దుర్గం, మేడిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇటీవల చనిపోయిన విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి తోడుగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ తూర్పు రాజులు, గండివేట్ కాంగ్రెస్ నాయకుడు పరమేశ్వర్, లక్ష్మణ్, సంగని బాబా, సర్దార్ సింగ్, రవి, ప్రకాష్, సురేష్, రాము యాదవ్, సంతోష్, ఉమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.