చ‌క్కెర ఎగుమ‌తుల‌ను నిషేధించ‌నున్న భార‌త్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ధ‌ర‌ల మంట‌కు చెక్ పెట్టేందుకు అక్టోబ‌ర్ నుంచి ప్రారంభ‌మ‌య్యే త‌దుప‌రి సీజ‌న్‌లో చ‌క్కెర ఎగుమ‌తుల‌ను భార‌త్ నిషేధించ‌నుంది. వ‌ర్ష‌పాతం త‌గినంత లేక‌పోవ‌డంతో ఈసారి చెర‌కు దిగుబ‌డి త‌గ్గ‌నుండ‌టంతో ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క స‌హా చెర‌కు సాగ‌య్యే ప్రాంతాల్లో స‌గ‌టు వ‌ర్ష‌పాతం కంటే 50 శాతం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదైంది.ఏడేండ్ల త‌ర్వాత భార‌త్ చ‌క్కెర ఎగుమ‌తుల‌పై నిషేధం విధిస్తోంది. జులైలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 15 నెలల గ‌రిష్ట‌స్ధాయిలో 7.4 శాతానికి ఎగ‌బాక‌డం, ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 11.5 శాతానికి చేర‌డంతో భార‌త్ చెర‌కు ఎగుమ‌తుల‌పై బ్యాన్ విధించే ప్ర‌తిపాద‌న‌ను పరిశీలిస్తోంద‌ని చెబుతున్నారు.మూడేండ్ల గ‌రిష్ట‌స్ధాయిలో ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గ‌డంతో ఆహారోత్ప‌త్తుల ధ‌ర‌ల‌కు చెక్ పెట్టేందుకు ఎగుమ‌తుల‌పై నిషేధం అనివార్య‌మ‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇక 2023-24 సీజ‌న్‌లో చెర‌కు దిగుబ‌డి 3.3 శాతం త‌గ్గి 31.7 మిలియ‌న్ ట‌న్నుల‌కు ప‌డిపోతుంద‌ని అంచ‌నా.

 

Leave A Reply

Your email address will not be published.