శ్రీ సత్య సాయి జిల్లాలో అమానవీయ ఘటన

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లాలో  అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డెంగ్యూ జ్వరంతో  మృతి చెందిన  బాలుడి డెడ్ బాడీని బైక్ పై తరలించారు  పేరేంట్స్. జిల్లాలోని అమరాపురం మండలం హనుమంతుల గ్రామానికి చెందిన  పేరేంట్స్ తమ కొడుకుకు జ్వరం వస్తే  శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చారు.  బాలుడిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.  మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం సమకూర్చాలని  పేరేంట్స్ ఆసుపత్రి  సిబ్బందిని కోరారు. అయితే  వాహనం లేదని  చెప్పడంతో  డెడ్ బాడీని  బైక్ పై తీసుకెళ్లారు పేరేంట్స్. also read:తిరుపతి రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం: 90 కి.మీ. బైక్ పై డెడ్ బాడీని తరలించిన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి.2022 ఏప్రిల్ 26న  తిరుపతిలోని రుయా  ఆసుపత్రిలో  అమానవీయ ఘటన చోటు చేసుకుంది.  అన్నమయ్య జిల్లాలోని చిట్వేల్ గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నీ వ్యాధికి చికిత్స కోసం రుయా ఆసుపత్రిలో చేర్పించారు పేరేంట్స్.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. డెడ్ బాడీని తరలించేందుకు  ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్ మాఫియా  పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో తనకు తెలిసిన వారి వాహనంలో కొడుకు డెడ్ బాడీని తరలించేందుకు కూడ  అంబులెన్స్  మాఫియా  అడ్డుపడింది. దీంతో బైక్ పై డెడ్ బాడీని  తండ్రి తరలించారు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఆసుపత్రి నుండి మృతదేహల తరలింపు కోసం  వాహనం అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కానీ  సత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న ఘటన  మరోసారి ప్రభుత్వాసుపత్రుల నుండి డెడ్ బాడీల తరలింపు కోసం వాహనం లేదనే విషయం వెలుగు చూసింది. వాహనం  ఉన్నా కూడ  ఆసుపత్రి సిబ్బంది ఇవ్వలేదా.. లేక  వాహనం లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.