చంద్రబాబు సీఎం కావాలని రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సీబీఎన్ ఫోరమ్ ప్రతినిధులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో సమస్యలపై అంశాల వారీగా వివరిస్తూ ప్రజలకు సీబీఎన్ ఫోరం టీం అవగాహన కల్పిస్తోంది. నందిగామలో ఈరోజు దళిత గళం పేరుతో జగన్ దళితులకు చేసిన అన్యాయాన్ని వివరించేలా సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత మాట్లాడుతూ.. ‘‘సీబీయన్ ఫోరం ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. 2020 విజన్ ద్వారా చంద్రబాబు ఉమ్మడి ఎ.పీలో ఐటీ విప్లవం తీసుకు వచ్చారు. ఆయన ముందు చూపు కారణంగానే లక్షలాది మంది తెలుగువాళ్లు ఐటీ రంగంలో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో మన తెలుగు వాళ్లకు కేరాఫ్ అడ్రస్ ఏర్పడింది. అటువంటి చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయించి, జైల్లో పెట్టారు. వాస్తవాలను వివరించాలనే మేమంతా కలిసి సీబీయన్ పోరం ప్రారంభించాం. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి, యువతకు జరిగిన మేలు గురించి వివరిస్తున్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు, అభివృద్ధి అంశాలలో చంద్రబాబు మార్కును మరోసారి గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో మహిళా సమస్యలు, నిరుద్యోగం, దళితులకు జరిగిన అన్యాయం, ఇలా అంశాల వారీగా సభలు నిర్వహిస్తున్నాం. ఇందులో మేధావులు సైతం పాల్గొని తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు సేవలు ఎంతో అవసరం.. అందుకే మరోసారి సీఎంను చేయాలని మా వంతు కృషి చేస్తున్నాం’’ అని సుమిత వెల్లడించారు.

సీబీయన్ ఫోరం ప్రధాన కార్యదర్శి అమర్ మాట్లాడుతూ.. ‘‘సీబీయన్ ఫోరమ్‌లో అన్ని వర్గాల వారు ప్రతినిధులుగా ఉన్నారు. కొంతమంది ఒక సామాజికవర్గం పేరు చెప్పి వారి తప్పులు బయటపడకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీకి ఎంత మేలు జరిగిందో వివరిస్తున్నాం. ఆయన విజన్‌ను అర్థం చేసుకుంటే.. భవిష్యత్ తరాలకు ఎంతో మంచి జరుగుతుంది. 2020 విజన్ వల్లే మేమంతా మంచి స్థానాల్లో స్థిరపడ్డాం. 2047 విజన్ ద్వారా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు, యువత మమ్మలను చూసైనా వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఐదేళ్లల్లో అభివృద్ది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎంత మేర వచ్చా. యికేవలం సంక్షేమం పేరుతో డబ్బులు పంచితే కుటుంబాలు బాగుపడతాయా. యువత ఆర్ధికంగా, ఉద్యోగ పరంగా ఎదిగే అవకాశాలు చూపించరాఅందుకే మేము ప్రజలను ఆలోచించాలని కోరుతున్నాం. అంశాల వారీగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ… ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నాం2024 లో చంద్రబాబు సీఎం కావడం ద్వారానే ఏపీ అభివృద్ది సాధ్యం అనే వాస్తవాన్ని గుర్తించాలని కోరుతున్నాం’’ అని అమర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.