ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమంటే నేరమా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫోక్సో చట్టం దుర్వినియోగం అవ్వడంతో పాటు సాక్ష్యాలు లేక నేరస్తులు తప్పించు తప్పించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరితే బెదిరిమ్పులకు పాల్పడుతున్న డిఇఓ రోహిణిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ స్టేట్ బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం  హైదర్ గూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే విషయమై హైదరాబాద్ విద్యాశాఖ అధికారి(డిఇఓ) ఆర్.రోహిణికి విన్నవించగా గత ఏడాది డిసెంబర్ 20 న ఆఫీస్ కు పిలిపించుకుని బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. డిఇవోపై ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేనలు స్పందించి సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ డిఈఓ రోహిణి తనను వికలాంగుడినని కూడా చూడకుండా సిసి కెమేరాలు ఎక్కడి నుండి తీసుకురావాలి? అలాంటి ప్రొవిషన్ ఏమైనా ఉన్నదా? పిచ్చి పిచ్చి ఆర్.టి.ఐ యాక్ట్ 2005 పిటిషన్స్ వేస్తున్నావు నిన్ను సస్పెండ్ చేస్తా, పోలీసులకు ఫోన్ చేస్తా అని వేలి చూపుతూ బెదిరించిందని ఆరోపించారు. డిఈఓ వలన తనకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ ఆమెపై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జనవరి 5 న అబిడ్స్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రక్షణ కల్పించాలని రాష్ట్ర గవర్నర్, డీజీపీ, సిపిలకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.