ఉద్యోగుల మచ్చిక కోసమే  పీఆర్సీ బిస్కెట్లేస్తున్నారా ?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 12వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూలైలో కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సుంది. అయితే వివిధ కారణాలతో జూన్లో పీఆర్సీ కమిటి వేస్తున్న కారణంగా జూలైలో అమలుసాధ్యంకాదు. కొత్త పీఆర్సీని నియమించాలని వెంటనే సిఫారసులను అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని ఎప్పటినుండో డిమాండ్లు చేస్తున్నాయి. ఈ డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్యాలయం అవసరమైన వేదికను సిద్ధంచేస్తోంది.పీఆర్సీ కమిటి ఛైర్మన్ గా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మతో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. ఛైర్మన్ గా ఎవరున్నా ఉద్యోగులకు మేలుజరిగే సిఫారసులు ఉంటాయనే ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కమిటి కూడా అవసరమైన సిఫారసులను చేస్తుందనటంలో సందేహంలేదు. జీతబత్యాల విషయంలో ఉద్యోగులకు లబ్దిజరగాలంటే పీఆర్సీ కమిటియే సరైన వేదికని అందరికీ తెలిసిందే.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోయినసారి పీఆర్సీ నివేదికను అమలుచేయటంలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మధ్య పెద్ద వివాదమే రేగిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఆశించినంత స్ధాయిలో జీతాలు పెంచేదిలేదని ప్రభుత్వం చెప్పింది. దాంతో పీఆర్సీ నివేదికలో చెప్పిన సిఫారసుల ప్రకారం జీతాలు పెరగాల్సిందే అని ఉద్యోగసంఘాలు పట్టుబట్టారు.మొత్తానికి ఇదే విషయమై రెండువైపులా భీష్మించుకుని కూర్చోవటంతో పెద్ద గొడవే అయ్యింది. ఇప్పటికీ ఆ వివాదం ముగియలేదనే చెప్పాలి. అది ముగియకుండానే కొత్తగా మరో పీఆర్సీ అంటే పరిస్దితులు ఎలాగుంటాయో తెలీదు.పీఆర్సీ అమలుకావచ్చు జీతాలు మొదటితేదీన ఇచ్చే విషయం కావచ్చు డీఏల్లాంటి అనేక అంశాల కారణంగా ఉద్యోగులు ప్రభుత్వంపై బాగా మండిపోతున్నారు. మరి ఉద్యోగుల్లోని మంటను చల్లార్చాలంటే కచ్చితంగా వాళ్ళను సంతృప్తిపరిచేట్లుగానే రాబోయే పీఆర్సీ కమిటి సిఫార్సులుండాలని ప్రభుత్వానికి బాగా తెలుసు.కొత్త పీఆర్సీని నియమించాలి కమిటి అధ్యయనం చేయాలి సిఫారసులు చేయాలి. మళ్ళీ వాటిపై ఉద్యోగసంఘాలతో చర్చించి ఫైనల్ చేయాలి. ఇదంతా జరిగేటప్పటికి ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పలేరు. కాకపోతే ఎన్నికల సంవత్సరం కాబట్టి స్పీడుగానే ప్రక్రియ చేపట్టే అవకాశముంది.

 

Leave A Reply

Your email address will not be published.