ఉత్తమ్ కుమార్ రెడ్డి గీత దాటుతున్నారా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన పంచాయితీ రోజరోజుకు ముదురుతోంది. సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా విడిపోయిన తరువాత ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.  మొన్నటి వరకు అంతో ఇంతో కలిసున్న కొందరు నాయకులు ఇప్పుడు మాటలతో యుద్ధం చేస్తున్నారు. తాజాగా టీ కాంగ్రెస్ లో మృదు స్వభావిగా పేరున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిలోనూ అసహనం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ నాయకులను సముదాయించిన ఆయన ఇప్పుడు పరుష వ్యాఖ్యలు చేస్తూ గీత దాటుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ను మార్చాలన్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో  ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా కాంగ్రెస్ పార్టీలోకే వచ్చారు. అవకాశాలు చూసి  పార్టీ మారే రాజకీయ నాయకుడు కాదు ఆయన. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటూ గాంధేయభావాలు కలిగిన వ్యక్తి. తాను నమ్ముకున్న కాంగ్రెస్ కోసం పనిచేస్తూ వచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా పనిచేసినంతకాలం ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా వాటిని సున్నితంగా మాత్రమే ప్రతిస్పందించారు. అయితే టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్ తట్టుకోకపోవడంతో స్వయంగా ఆయనే తన పదవికి రాజీనామా చేశారు.టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించలేదు. ఆయన కు సపోర్టుగా పలు సూచనలు చేశారు. ఇతరులు విమర్శలు చేసినా వారిని సముదాయించేవారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ లో మరో కోణం కనిపిస్తోంది.  పీసీసీ చీఫ్  కు కొత్త వ్యక్తి కావాలని ఆయన పట్టుబట్టడం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్లో ఓ వర్గంలో రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉంది. ఈ క్రమంలో పార్టీ వివాదాలను పరిష్కరించాల్సింది పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్లు  మరింది ఆజ్యం పోయడం క్యాడర్ ను అసంతృప్తికి గురిచేస్తోంది.టీ కాంగ్రెస్ లో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాలని అధిష్టానం  దిగ్విజయ్ సింగ్ ను పంపించింది.  ఆయన ఇరు వర్గాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి వారికి పలు సూచలను చేశారు.  పార్టీలో అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చిన్న చిన్న మనస్పర్థలతో పార్టీకి నష్టం తేవద్దని అన్నారు. అయితే ఓవరాల్ గా పీసీసీ చీఫ్ కు చురకలు అంటించారని అంటున్నాయి. అటు సీనియర్లు పార్టీకి నష్టం తేకుండా సముదాయించాలన్నట్లు చెప్పారు.  ఆయన అలా చెప్పి అటు వెళ్లారో లేదో.. మళ్లీ పాత  కథే మొదలైంది.అయితే ఈసారి పార్టీలో చిచ్చు చల్సార్చాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఇలా పరుష వ్యాఖ్యలు చేయడంతో మరింత ఆందోళనకు దారి తీస్తుందని ఆయనకు తెలియంది కాదు. అయినా ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. వివాద పరిష్కారానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ తో సీనియర్లు పీసీసీ చీఫ్ ను మార్చాలని పట్టుబట్టారు. అటు కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ను కూడా తప్పించాలన్నారు.కానీ పీసీసీ చీఫ్ మార్చే అధికారం తనకు లేదన్నారు. అయితే సీనియర్లు మాత్రం అదే పట్టుతో పీసీసీ చీఫ్ పై ఆరోపణలు చేస్తుండడంతో ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుందోనని చర్చించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.