పేలుళ్లకు ఐఎస్‌కేపీ ప్లాన్.. ఏటీఎస్ విచారణలో బయటపడ్డ కుట్ర!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐఎస్‌కేపీ (ఇస్లామిక్‌ స్టేట్‌ ఖోరాసన్‌ ప్రావిన్స్‌) ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ ఏటీఎస్ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. సూరత్, హైదరాబాద్ నుంచి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. ఖదీజా అలియాస్ అబిదా, సుబేరా భానును ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఐఎస్‌కేపీ విస్తరణకు దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు మహిళలు నెట్‌వర్క్‌ పెట్టుకున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సుబేర, అబిదా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే యూత్ను ఐఎస్‌కేపీలో చేర్చుకున్నారు. అరెస్ట్‌ అయిన ఉగ్రవాదులతో కూడా ఈ మహిళలిద్దరూ సంప్రదింపులు జరిపినట్లుగా గుర్తించారు. ఇక వీరిద్దరి సీడీఆర్ ను గుజరాత్ ఏటీఎస్ పరిశీలించింది. గుజరాత్, జమ్ముకశ్మీర్‌, యూపీ, తెలంగాణలో నెట్‌వర్క్‌ విస్తరించాలని ప్రణాళిక రచించారు. గుజరాత్లో ఇంతకుముందే అరెస్ట్‌ అయిన నలుగురు ఉగ్రవాదులతో సుబేర అనే మహిళ ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. అలాగే అప్ఘనిస్తాన్‌లో ఫిదాయిన్‌ దాడులకు సుబేర ప్లాన్‌ చేసినట్లు ఏటీఎస్ విచారణలో బట్టబయలైంది. ఇంకా ఐఎస్‌కేపీతో ఎవరికి సంబంధాలు ఉన్నాయన్నదానిపై ఏటీఎస్ కూపీలాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.