నిరంతరాయంగా పనిచేసేది గుండె ఒకటే కాదు మూత్రపిండాలు కూడా

తెలంగాణాజ్యోతి/వెబ్ న్యూస్:

మూత్రం పడుతున్న దగ్గర నురుగ ఫామ్ అవ్వడం, మందు, సిగరెట్ అలవాటు, నీరు తక్కువగా తాగే వాళ్ళు, బిపి, షుగర్ ఉన్నవాళ్ళకు, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వాళ్లకు కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.మూత్రపిండాలు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. అందులో  2 లీటర్ల వ్యర్థ, విష పదార్థాలను వేరుచేసి విసర్జిస్తాయి.శరీరంలో చచ్చేవరకు నిరంతరాయంగా పనిచేసేది గుండె ఒకటే కాదు  మూత్రపిండాలు కూడా.24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి.150గ్రా. బరువు ఉండే ఈ చిన్ని కిడ్నీ దెబ్బ తింటే ఇంకా అంతే. బ్రతికి ఉన్నన్ని రోజులు డయాలసిస్ చేయించుకుంటూ జీవితాన్ని గడపాల్సిందే.కిడ్నీలు దెబ్బతిన్న తర్వాత ఆలోచించే కన్నా. ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం తెలివైన పని.రోజుకు మినిమం 8 గ్లాసుల నీళ్లు, మంచి కూరగాయలు, పండ్లు కలిసిన ఆహారం తీసుకోవాలి.అలా కుదరడం లేదు. అనుకుంటే కనీసం ఏడాదిలో 3 నెలల పాటు పునర్నవ చూర్ణం తీసుకోవాలి.

క్షీణిస్తున్న కణాలను ఆరోగ్యంగా ఉంచేది పునర్నవ

తెల్ల గలిజేరుగా పిలిచే ఈ మొక్క చూర్ణాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా గోరువెచ్చని నీళ్లలో కలుపుకొని తాగితే, కిడ్నీ కణాలు ఆరోగ్యవంతం అవుతాయి, ఫిల్టరింగ్ పవర్ పెరుగుతుంది. దాంతో శరీరం మొత్తం ఎప్పుడు క్లీనగా ఉంటుంది.ఇది ఎవరైనా, ఎలాంటి వ్యాధులుఉన్నా… లేకున్నా… చిన్న..  పెద్ద.. అందరు తీసుకోవచ్చు.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఎవరికైతే స్వచ్ఛమైన న్యాచురల్ పునర్నవ చూర్ణం కావాలో ఆయుర్వేద మెడికల్ షాపులో దొరుకుతుంది.

Leave A Reply

Your email address will not be published.